ఏపీ సీఎంతో ప్రభాస్ భేటీ.. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డ బాహుబలి..

సినీ తారలు జనాలను ఆకట్టుకునేలా డ్రెస్సులు వేసుకుంటారు.హీరోయిన్లు అయితే అందాలన్నీ ఒలకబోసేలా దుస్తులు ధరిస్తారు.

ఆయా హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సులు కొన్ని వారెవ్వా అనిపిస్తే.మరికొన్ని ఇవేం బట్టలురా బాబోయ్ అనిపిస్తాయి.

కొన్నిసార్లు వారి డ్రెస్సులు నవ్వు వచ్చేలా చేస్తాయి.స్టైలిష్ డ్రెస్సులు వేసుకుని ఎంత అందంగా ఉంటారో.

ఒక్కోసారి అవే డ్రెస్సులు వారిని చాలా ఇబ్బంది పెట్టిస్తాయి.హీరోయిన్స్ చాలా మంది తాము వేసుకున్న డ్రెస్సులతో పలు మార్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చూశాం.

Advertisement

హీరోల విషయంలో ఇలాంటి ఇబ్బందులు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.తాజాగా ఓ టాప్ హీరో తను వేసుకున్న డ్రెస్ తో బాగా ఇబ్బంది పడ్డాడు.

ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా టాలీవుడ్ ప్రముఖులు కొందరు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు టిక్కెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడారు.టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు దిగ్గజ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, అలీ పోసాని మురళీ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

అయితే ఈ పర్యటనలో ప్రభాస్ బాగా ఇబ్బంది పడ్డాడు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రభాస్ ఇబ్బందికి అసలు కారణం ఏంటంటే.ఆయన చాలా స్టైలిష్ గా డ్రెస్ వేసుకున్నాడు.షర్ట్, ఫ్యాంట్, దానికి తగిన షూ అయితే వేసుకున్నాడు కానీ.

Advertisement

ఫ్యాంటుకు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాడా? లేదా అదే స్టైల్ అనుకున్నాడా? తెలియదు కానీ.పలు మార్లు సరి చేసుకుంటూ కనిపించాడు.

నిలబడ్డా, కూర్చున్నా, మీడియాతో మాట్లాడినా.ఫ్యాంట్ తో ప్రభాస్ అన్ కంఫర్ట్ గా ఫీలయ్యాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.కొంత మంది ప్రభాస్ మీద సటైర్లు కూడా వేస్తున్నారు.

ఇంత ఇబ్బంది పడే బదులు బెల్ట్ ఒకటి పెట్టుకోవచ్చుగా అంటూ ఆట పట్టిస్తున్నారు.

తాజా వార్తలు