వైష్ణవి చైతన్యకు తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. రాఖీ గిఫ్ట్ మామూలుగా లేదంటూ?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా అక్క తమ్ముళ్లు, అన్నా చెల్లెలు ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు.

రాఖీ పండగ వచ్చింది అంటే చాలు ఎంత దూరంలో ఉన్నా కూడా సరే, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకచోటకు చేరాల్సిందే.రాఖీ కట్టి తీరాల్సిందే.

ఎంతో ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి అన్న తమ్ముడు తనకు తోచినంతలో ఎంతో కొంత డబ్బో లేదంటే ఏదైనా బహుమతో ఇస్తాడు.అలా తనకు కూడా తమ్ముడు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడని అంటోంది వైష్ణవి చైతన్య.

అయితే ఆ గిఫ్ట్‌ రాఖీ పండగకు కాకుండా తన బర్త్‌డేకి ఇచ్చాడంది.కానీ, ప్రతి రాఖీ పండగకు అదే గిఫ్ట్‌ చూపిస్తున్నాడంటోంది.ఇంతకీ ఆ బహుమతి మరేంటో కాదు పచ్చబొట్టు.

Advertisement

ఈ సందర్బంగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) మాట్లాడుతూ.నా బర్త్‌డేకి గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నాడు.

అలా తన ఎడమచేతిపై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు.అది నిజమైన టాటూ అనుకోలేదు, జోక్‌ చేస్తున్నాడనుకున్నాను.

కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని అర్థమైంది.ఈ పచ్చబొట్టు వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట!.

చాలా ఎమోషనల్‌ అయిపోయాను, ఏడ్చేశాను.అప్పటి నుంచి రాఖీ కట్టిన ప్రతిసారి పచ్చబొట్టు చూపిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.వైష్ణవి చైతన్య విషయానికి వస్తే.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఈమె ఇటీవల విడుదల అయినా బేబీ( Baby ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ ని రాబట్టంతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.

Advertisement

కలెక్షన్ల సునామీని సృష్టించింది.ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య.

తాజా వార్తలు