కొత్త టీమ్ ను సిద్ధం చేస్తున్న బాబు 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో( AP elections ) టిడిపి కూటమి ఘనవిజయం సాధించడం ,వైసిపి ఘోర పరాజయం చెందడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.

ఇక కొత్త మంత్రి వర్గం లోకి ఎవరెవరిని తీసుకోవాలి,  పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలి ?  ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనే అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.దీంతో పాటు పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

జగన్ ( jagan )ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెడుతున్నారు.సిఎస్ , డిజిపి తో పాటు , సీఎం కార్యాలయ అధికారులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు.పూర్తిగా తన టీమ్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

  దీనిలో భాగంగానే అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ముందుగానే మొదలుపెట్టారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు .ఆయన ఈ నెల ఆఖరున పదవి విరమణ చేయనున్నారు.చంద్రబాబు సూచనలతో జవహర్ రెడ్డి( Jawahar Reddy ) సెలవు వెళ్లారు.

Advertisement

అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా జగన్ హయాంలో పనిచేసిన రావత్ అనారోగ్య కారణాలతో ఉన్నారు.చంద్రబాబు తన పాలన ప్రారంభానికి ముందే సీఎస్,  డీజీపీ , ఇంటిలిజెన్స్ చీఫ్ నియామకం పైన ఫోకస్ చేశారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే అధికారుల టీమ్ ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .2014 - 19  టీడీపీ ప్రభుత్వ హయాంలో తన కార్యాలయంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ , గిరిజ శంకర్ ( Sai Prasad, Girija Shankar )లకు మళ్ళీ అవకాశం ఇచ్చే ఆలోచనతో ఉన్నారు.ఈ ఇద్దరితో పాటు సిద్ధార్థ జైన్ ను సీఎంఓలోకి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.

ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నిన్ననే చంద్రబాబుతో భేటీ  అయ్యారు ఆ సమయంలో చంద్రబాబు ఆయనను పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.చంద్రబాబుకు కొన్ని విషయాలను వివరించే ప్రయత్నం చేసినా,  ఇప్పుడు ఏమి అవసరం లేదని తేల్చి చెప్పారు.

జవహర్ రెడ్డి స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పైనే  ప్రస్తుతం చంద్రబాబు దృష్టి సారించారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు