కేసీఆర్ డెడ్‌లైన్ డేట్ ఇదే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీ సీఎం చంద్రాబాబు మాదిరిగా అధికారుల‌కు డెడ్‌లైన్‌లు పెడుతున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వివిధ ప‌నుల్లో బిజీగా ఉన్న ఆయ‌న ఇప్పుడు హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న మెట్రో రైలు నిర్మాణంపై దృష్టి పెట్టారు.

వాస్త‌వానికి వైఎస్ హ‌యాంలో మొద‌లైన మెట్రో ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది.దీనికి ప్ర‌ధాన‌మైన నిధుల స‌మ‌స్య ఎటూ తేల‌క‌పోవ‌డ‌మేన‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక‌, హైద‌రాబాద్‌లో ఆ మూల నుంచి ఈ మూల‌కు విస్త‌రించిన మెట్రో విష‌యంలో ప‌నులు ఆశించిన మేర‌కు జ‌ర‌గ‌లేదు.ఇక‌, హైద‌రాబాద్ మెట్ర‌లో నాగోల్ .మెట్టుగూడ - మియాపూర్.ఎస్ ఆర్ నగర్ మార్గం పూర్తైయి నెలలు గడుస్తున్నాయి.

ట్రయిల్ రన్ కూడా ప‌లు మార్లు వేశారు.రైళ్ల రాక‌పోక‌ల‌కు అనుమతులు కూడా వ‌చ్చాయి.

Advertisement

అయినా జ‌నానికి మాత్రం అందుబాటులోకి రాలేదు.దీనికి నిధుల స‌మ‌స్య‌తో పాటు స్థానికంగా కొన్ని ఆందోళ‌న‌లు, ప్ర‌భుత్వం-అధికారుల మ‌ధ్య స‌మన్వ‌య లోపం వంటివి ఉన్నాయి.

అయితే, జ‌నాలు మాత్రం నానాతి ప్ప‌లు ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలో దృష్టి పెట్టి న కేసీఆర్‌.

దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ 2018 నాటికి పూర్తి చేయాల‌ని అధికారుల‌కు డెడ్ లైన్ పెట్టారు.ప్ర‌స్తుతం మెట్రో ప‌నులు దాదాపు 75 % పూర్త‌య్యాయ‌ని చెప్పిన కేసీఆర్ మిగిలిన ప‌నులు కూడా స‌కాలంలో పూర్తి చేయాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.ఏపీలో పోల‌వరం ప్రాజెక్టు మాదిరిగా తెలంగాణ‌లో మెట్రో ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి.2019 ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని కేసీఆర్ కూడా ప్లాన్ చేశారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!
Advertisement

తాజా వార్తలు