నేను అధ్యక్షుడినైతే .. ముస్లింలు అమెరికా రాకుండా బ్యాన్ చేస్తా : ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ( US Presidential Elections ) హాట్ హాట్‌గా జరుగుతోంది.బరిలో నిలిచిన నేతలు తాము గెలిస్తే ఇది చేస్తాం.

అది చేస్తామని హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఇజ్రాయెల్- హమాస్( Israel-Hamas War ) యుద్ధాన్ని కూడా అమెరికన్ రాజకీయ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఈ విషయంలో మరీ దూకుడుగా వున్నారు.అమెరికాలో పెద్ద సంఖ్యలో వున్న యూదు ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను అధ్యక్షుడినైతే .ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించని దేశాలకు చెందిన ముస్లింలను అమెరికాకు రాకుండా నిషేధిస్తానని వ్యాఖ్యానించారు.యాంటీసిమిటిక్ అయిన విదేశీ విద్యార్ధుల వీసాలను కూడా రద్దు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.

Advertisement

శనివారం జరిగిన ‘‘ Republican Jewish convention ’’లో పాల్గొన్న ట్రంప్.గతంలో తన హయాంలో అమలు చేసిన వివాదాస్పద ట్రావెల్ బ్యాన్‌ను తిరిగి అమలు చేస్తానని స్పష్టం చేశారు.రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు( Radical islamic Terrorists ) తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటానని ట్రంప్ అన్నారు.2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వున్న సమయంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్, సూడాన్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు.మతాన్ని టార్గెట్ చేసుకుని ట్రంప్ వివక్ష చూపుతున్నారని కొందరు కోర్టులను సైతం ఆశ్రయించారు.

అయితే 2021లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వారంలోనే జో బైడెన్( Joe Biden ) ఈ ట్రావెల్ బ్యాన్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్ధతు ప్రకటించారు.అమెరికా నైరుతి భాగంలో కీలకమైన నెవాడా రాష్ట్రంలోని లాస్ వెగాస్‌( Los Vegas )లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.ఇజ్రాయెల్ తమకు మిత్రుడని పేర్కొన్నారు.

తమ మిత్రదేశాన్ని తాను రక్షిస్తానని తెలిపారు.ఇక అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన మరో రిపబ్లికన్ నేత, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( De Santis ) సైతం ఇజ్రాయెల్‌కు మద్ధతు పలికారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని హోలోకాస్ట్ తర్వాత యూదులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు