జుట్టు ఆరోగ్యానికి అండగా నిలిచే అశ్వగంధ.. ఇలా వాడితే ఊహించని లాభాలు మీ సొంతం!

అశ్వగంధ.దీని పేరు త‌ర‌చూ వింటూనే ఉంటాము.ఇది ఒక పురాత‌న మూలిక.

ఆయుర్వేద వైద్యంలో ఈ మూలికకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.అశ్వగంధ మూలికలో అపారమైన ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడతాయి.క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులను అడ్డుకుంటాయి.

అలాగే అశ్వగంధ వివిధ ప్రాణాంతక వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది.ఇక జుట్టు ఆరోగ్యానికి కూడా అశ్వగంధ అండగా నిలుస్తుంది.

Advertisement

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా అశ్వగంధను వినియోగిస్తే ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు అశ్వగంధ ను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు అశ్వగంధ మూలికలు వేసుకోవాలి.

అలాగే గింజ తొలగించిన కుంకుడు కాయలు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మ‌రుసటి రోజు నానబెట్టుకున్న అశ్వగంధ మూలికలు మరియు కుంకుడుకాయలు వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు ఒక గ్లాస్ వార్మ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

కెమికల్స్ నిండిన షాంపూలను వాడే బదులు పైన చెప్పిన విధంగా వారంలో రెండు సార్లు హెయిర్‌ వాష్ చేసుకుంటే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుముఖం పడతాయి.

Advertisement

మరియు తలలో నుంచి దుర్వాసన రాకుండా కూడా ఉంటుంది.

తాజా వార్తలు