దగ్గు విపరీతంగా వేధిస్తుందా? ఇలా చేస్తే రెండు రోజుల్లో పరార్ అవుతుంది!

వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గ‌త కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది దగ్గుతో తీవ్రంగా బాధపడుతున్నారు.ఇంట్లో ఒకరికి దగ్గు పట్టుకుందంటే చాలు మిగిలిన వారందరికీ సుల‌భంగా పాకేస్తోంది.

 Effective Remedy For Cough Relief ,cough Relief Remedy, Cough, Latest News, Heal-TeluguStop.com

పైగా ఒక్కోసారి దగ్గు అంత సులభంగా వదిలిపెట్టదు.దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

రాత్రుళ్ళు సరైన నిద్ర కూడా ఉండదు.మిమ్మల్ని కూడా దగ్గు విపరీతంగా వేధిస్తుందా.? అయితే అసలు చింతించకండి.

Telugu Cough, Cough Remedy, Cough Tips, Tips, Latest-Telugu Health

ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే కేవలం రెండు రోజుల్లోనే దగ్గు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఆరు టేబుల్ స్పూన్ల తేనె వేసి మరోసారి స్పూన్ సహాయంతో కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

Telugu Cough, Cough Remedy, Cough Tips, Tips, Latest-Telugu Health

ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి.ఇలా చేస్తే మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు, అల్లం పొడి మరియు తేనెలో ఉండే యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెండ్స్‌ దగ్గును చాలా వేగంగా మరియు సహజంగా త‌రిమికొడుతుంది.జలుబు సమస్య ఉంటే దూరం అవుతుంది.గొంతు నొప్పి, వాపు వంటి సమస్యల‌ను నివారించడానికి కూడా ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి ఎవరైతే దగ్గుతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube