జ్ఞాపకశక్తిని పెంచే ఈ పోషకాలను మీరు తీసుకుంటున్నారా.. లేదా..?

జ్ఞాపకశక్తి లేదా మెమోరీ ప‌వ‌ర్( Memory Power ) అనేది మ‌న జీవితంలో చాలా ముఖ్య‌మైన పాత్రను పోషిస్తుంది.

విజయం, అభివృద్ధి, ఆనందం, మరియు బలమైన సంబంధాలను పెంపొందించడానికి జ్ఞాపకశక్తి ఎంతో అవ‌స‌రం.

అటువంటి జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి కొన్ని పోష‌కాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.మ‌రి ఆ పోష‌కాలు ఏంటి.? అవి ఏయే ఆ ఫుడ్స్ లో ల‌భిస్తాయి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.మెదడు పనితీరుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్( Omega-3 Fatty Acids ) అత్యంత అవ‌స‌రం.

జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా పనితీరును మెరుగుప‌ర‌చ‌డంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి.సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపుల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.

వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కు గొప్ప మూలం.

Are You Taking These Nutrients That Boost Memory Details, Memory, Memory Power,
Advertisement
Are You Taking These Nutrients That Boost Memory Details, Memory, Memory Power,

జ్ఞాపకశక్తిని పెంచుకోవాల‌నుకుంటే మెగ్నీషియం( Magnesium ) తీసుకోవాలి.మెదడు నాడీ సంకేతాలను మెరుగుపరచడంలో మెగ్నీషియం సహాయపడుతుంది.అవిసె గింజలు, బాదం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో మెగ్నీషియం స‌మృద్ధిగా దొరుకుతుంది.

నరాల పనితీరుకు, జ్ఞాపకశక్తి పెరుగుద‌ల‌కు విటిమ‌న్‌ బి6, బి9 (ఫోలేట్), బి12 ముఖ్యమైనవి.గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీన్స్, తృణధాన్యాలను తీసుకోవ‌డం ద్వారా ఈ విట‌మిన్ల‌ను పొంద‌వ‌చ్చు.

Are You Taking These Nutrients That Boost Memory Details, Memory, Memory Power,

మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడ‌టంలో మరియు జ్ఞాపకశక్తిని పెంపొందించ‌డంలో విటమిన్ సి, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవ‌స‌రం.అందుకోసం బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, డార్క్ చాక్లెట్, అరెంజ్‌, గుమ్మ‌డి గింజలు, స‌న్ ఫ్లెవ‌ర్స్ సీడ్స్ ను డైట్ లో భాగం చేసుకోండి.ఐర‌న్ ర‌క్త‌హీన‌త‌ను నివారించ‌డానికి మాత్ర‌మే కాకుండా మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేయ‌డంలోనూ సహాయపడుతుంది.

అదే స‌మ‌యంలో దృష్టి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.కాబ‌ట్టి ఐర‌న్ కోసం పాలకూర, కాయధాన్యాలు, ఎర్ర మాంసం, ఖ‌ర్జూరాలు, దానిమ్మ వంటి ఫుడ్స్ తినండి.

అన్నీ ఉన్నా ఈ హీరోయిన్ కు లక్ కలిసిరాలేదా.. అందుకే మూవీ ఆఫర్లు లేవా?
ఈ అలవాట్లు మీలో

జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంచే న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తికి ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఎంతో అవ‌స‌రం.చికెన్, చేపలు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, గుడ్ల ద్వారా మ‌నం ఈ పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

ఇక ఈ పోష‌కాల‌ను తీసుకోవ‌డంతో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.

నిత్యం వ్యాయామం చేయండి.త‌ద్వారా బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.

జ్ఞాపకశక్తి, ఆలోచ‌న శ‌క్తి రెట్టింపు అవుతాయి.

తాజా వార్తలు