కాంగ్రెస్ లో చేరబోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరేనా ? 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన నేతలతో పాటు , కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

వరుసగా పార్టీ లో కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరిపోవడం టెన్షన్ పుట్టిస్తూనే వస్తుంది.

  ఇంకా అనేకమంది నేతలు పార్టీ మారేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఇంకా చాలామంది ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరెందుకు సిద్ధంగా ఉన్నా.

  అనర్హత  అంశం టెన్షన్ కలిగిస్తుంది .వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కాంగ్రెస్ స్కెచ్ వేసింది.పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. 

సీఎల్పీ ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో , పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను చేర్చుకుంటే మంచిదనే అభిప్రాయంతో ఉందట.టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దమయ్యారట ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ముగియడం , సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అమెరికా టూర్ నుంచి రావడం,  రాజ్యసభ ఎన్నిక పూర్తవడం తో చేరికల పైన ప్రత్యేకంగా  ఫోకస్ పెట్టింది.జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్( Anilkumar Jadhav ) తో పాటు , గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల  ద్వారా తెలుస్తోంది.

Advertisement

వీరిలో ముగ్గురు చేరికలకు కాంగ్రెస్ అధిష్టానం.

 గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గా తెలుస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad ) కు చెందిన ఓ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉండడంతో ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.మరోవైపు జహీరాబాద్ , అలంపూర్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మాణిక్ రావు చేరికను జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం .ఆయన స్థానికుడు కాకపోవడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.అలంపూర్ లో ఎమ్మెల్యే సంపత్  l.విజయుడు చేరికపై అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు