ఇలా చేస్తే ఎలా దేవర.. 1000 కోట్ల రూపాయలు సాధించాలంటే ఇది పద్ధతి కాదుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా( Devara ) థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికీ ఆశించిన రేంజ్ లో అయితే జరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Junior Ntr Fans Not Happy With Devara Movie Promotions Details Inside Goes Vira-TeluguStop.com

దేవర సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.

సెప్టెంబర్ 7వ తేదీన దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.దేవర సినిమా నుంచి మరో రెండు పాటలు విడుదల కావాల్సి ఉండగా ఈ పాటలు ఎప్పుడు విడుదల అవుతాయనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని భోగట్టా.

దేవర సినిమా బడ్జెట్ పరంగా టాప్ మూవీ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.దేవర సినిమాలో జన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ కానుంది.

దేవర సినిమా హిట్టు బొమ్మ అని అయితే ఎక్కువమంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ కావాలంటే ఈ సినిమాకు మరింత ఎక్కువగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దేవర సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube