ఇలా చేస్తే ఎలా దేవర.. 1000 కోట్ల రూపాయలు సాధించాలంటే ఇది పద్ధతి కాదుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా( Devara ) థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికీ ఆశించిన రేంజ్ లో అయితే జరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.

"""/" / సెప్టెంబర్ 7వ తేదీన దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

దేవర సినిమా నుంచి మరో రెండు పాటలు విడుదల కావాల్సి ఉండగా ఈ పాటలు ఎప్పుడు విడుదల అవుతాయనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని భోగట్టా.

"""/" / దేవర సినిమా బడ్జెట్ పరంగా టాప్ మూవీ అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

దేవర సినిమాలో జన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ కానుంది.

దేవర సినిమా హిట్టు బొమ్మ అని అయితే ఎక్కువమంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ కావాలంటే ఈ సినిమాకు మరింత ఎక్కువగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

దేవర సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది.

కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?