చాట్‌జిపిటి స్పీడుని యాపిల్ అందుకోలేదట... ఆ మాటన్నది ఎవరో తెలుసా?

అవును, మీరు విన్నది నిజమే.చాట్‌జిపిటి స్పీడు( ChatGPT )ని యాపిల్ అందుకోలేదట.

ఈ మాటన్నది ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం చదవాల్సిందే.చాట్‌జిపిటి ఎప్పుడైతే ఇంటర్నెట్ ప్రపంచంలో అడుగుపెట్టిందో అప్పటినుండి టెక్‌ కంపెనీలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రేస్‌ నడుస్తోందని చెప్పుకోవాలి.

ఏఐ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి సంస్థలు పోటాపోటీగా అప్‌డేట్‌లు తెస్తున్నారు.గత సంవత్సరం చాట్‌జిపిటి రిలీజ్‌ అయినప్పటి నుంచి మైక్రోసాఫ్ట్‌ వార్తల్లో నిలుస్తోందనే విషయం అందరికీ తెలిసినదే.

ఆ తర్వాత గూగుల్‌ కంపెనీ హుటాహుటిన బార్డ్‌ చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది.అయితే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను అందించడంలో అన్నింటికంటే యాపిల్ ఏఐ రేస్‌లో ఎందుకు లేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకు కష్టమే అని సమాధానం చెబుతున్నారు యాపిల్ మాజీ ఇంజనీర్ ఒకరు.అవును, యాపిల్ మాజీ ఇంజనీర్ అయినటువంటి జాన్ బుర్కీ ( John Burkey )న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ, ఏఐ సర్క్యూట్‌లో అగ్రగామిగా మారాలనే లక్ష్యం ఉంటే, యాపిల్‌ కంపెనీకి సిరి పెద్దగా ఉపయోగపడదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ నేపథ్యంలో చాట్‌జిపిటికి ఆపిల్ ( Apple )సిరి ఎందుకు పోటీగా నిలవలేదనే అంశాలను కూడా వివరించారు.సిరి సాధారణ ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలదని, కొత్త కొత్త ప్రశ్నలకు సిరి సమాధానం ఇవ్వాలంటే, యాపిల్‌లోని ఇంజనీర్లు దాని డేటాబేస్‌కు కొత్త వర్డ్స్‌ను యాడ్‌ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ ప్రాసెస్‌ అంతటినీ పూర్తి చేయడానికి, చాట్‌జిపిటి తరహా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొడక్ట్‌ను యాపిల్‌ తీసుకురావడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుందని అభిప్రాయపడ్డారు.

వేగంగా వాయిస్ అసిస్టెంట్‌కి కొత్త టూల్స్, ఫీచర్‌లను యాడ్‌ చేయడానికి అనుకూలంగా ఉండదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు