ఒక వైపు బుజ్జగింపులు .. మరో వైపు రాజీనామాలు ! 

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS party )లో రాజకీయ ప్రకంపనాలు కొనసాగుతూనే ఉన్నాయి.

కొద్దిరోజుల కిందటే వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్( CM kcr ) ప్రకటించారు .

ఆ ప్రకటన తరువాత టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.కొంతమంది టికెట్ కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తుండగా,  మరి కొంత మంది మాత్రం అసంతృప్తితో పార్టీని వీడి వెళ్తున్నారు.

దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఒకవైపు పార్టీ కీలక నేత్రంతా రంగంలోకి దిగి బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తుండగా,  మరోవైపు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.బీఆర్ఎస్ లో టికెట్ దక్కని చాలామంది ఆశావాహులు కాంగ్రెస్ , బిజెపిలను సంప్రదిస్తూ టికెట్ హామీని పొందే ప్రయత్నం చేస్తున్నారు .ఆ పార్టీ నుంచి టికెట్ విషయమై గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్నారు.ఈ విషయాన్ని పసిగట్టే బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపి బుజ్జగింపుల ప్రక్రియను వేగవంతం చేసింది .అయినా చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు.కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్,  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీ ఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించారు .

Appeasement On One Side, Resignation On The Other Side, Brs, Telangana, Kcr, Tel
Advertisement
Appeasement On One Side, Resignation On The Other Side, BRS, Telangana, Kcr, Tel

అది కుదరకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ప్రస్తుతం ప్రకటించిన టికెట్ల కేటాయింపుల్లో తన పేరు లేకపోవడంతో, అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందితే ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో నిన్ననే ఆత్మీయ సమావేశం నిర్వహించారు.మరో వారం రోజుల్లో తాను ఏ పార్టీలో చేరబోతున్నాననేది ప్రకటిస్తానని తెలిపారు.

నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.ఇక పఠాన్ చెరువు టికెట్ ఆశించిన చిటుకల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇవ్వాలంటూ ఇస్నాపూర్ లో ఆయన వర్గీయులు ఆందోళన నిర్వహించారు.

నేడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని నీలం మధు తెలిపారు.

Appeasement On One Side, Resignation On The Other Side, Brs, Telangana, Kcr, Tel
విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

ఇక స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన సెట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Dr Thatikonda Rajaiah )ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు.స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,( Kadiyam Srihari )  మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి తాడికొండ రాజయ్య నివాసానికి వెళ్లారు.ఆయన అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడారు.

Advertisement

ఈరోజు కలుస్తానని ఎమ్మెల్సీ పల్లాకు ఎమ్మెల్యే రాజయ్య సమాచారం ఇచ్చారు.అలాగే సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు,  మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తో కలిసి నిన్ననే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో భేటీ అయ్యారు.

పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను బుజ్జగించారు.ఈ సందర్భంగా కెసిఆర్ సందేశాన్ని తుమ్మలకు వారు వివరించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం కలిసి పని చేద్దామని ప్రతిపాదించారు.ఇక మంత్రి హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హనుమంతరావు సస్పెన్షన్ వేటు వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుందట.

ఈ విధంగా అసంతృప్తి నేతలను ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది.

తాజా వార్తలు