కేంద్రం ఎపీకి సాయం చేస్తుందా?

భీకరమైన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమై పోయింది.భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అయింది.

రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సం రిపీట్ అయినట్లుగా అనిపిస్తోంది.పుండు మీద కారం చల్లినట్లుగా అసలే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని తుఫాను సర్వ నాశనం చేసింది.3000 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని అంటున్నారు.ఇది కేవలం అంచనా మాత్రమే.

జరిగిన నష్టం ఇంతకూ అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని తక్షణ సాయంగా 1000 కోట్లు అడిగారు.

వరద నష్టం పై లెక్కలు తీసి ఎంత నష్టం జరిగిందో అంచనా వేశాక ఇంకా సాయం అందించాల్సి ఉంటుంది.కాబట్టి వెంటనే సహాయక చర్యలు తీసుకోవడానికి వెయ్యి ఇవ్వాలని అడిగారు.

Advertisement

కాని కేంద్రం అడిగినంత ఇస్తుందా అనేది అనుమానమే.గత అనుభవం గుర్తు చేసుకుంటే ఇంత సాయం అందక పోవచ్చని అనిపిస్తోంది.

హుదూద్ తుఫాను వచ్చి విశాఖ నగరం సర్వ నాశనం అయినప్పుడు ప్రధాని మోడీ స్వయంగా వచ్చి చాలా ఆవేదన చెందారు.వెంటనే కావలసిన సహాయం చేస్తామని మాట ఇచ్చారు.

అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల సహాయం అడిగితే మొక్కుబడిగా కొంత ఇచ్చి చేతులు దులుపుకుంది కేంద్రం.కనీసం అడిగిన దాంట్లో సగం డబ్బు కూడా ఇవ్వలేదు.

ఇప్పటివరకు ఆ ఆర్ధిక సాయం పూర్తిగా అందలేదు.ఇప్పుడు జరిగిన నష్టం కూడా సామాన్యమైంది కాదు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరక ముందే ఒకసారి వచ్చి పరిస్థితి చూస్తే ఆయనకు అవగాహన ఏర్పడుతుంది.కానీ ఆ అవకాశం ఉండక పోవచ్చు.

Advertisement

పొరుగున ఉన్న తమిళనాడు కూడా తీవ్రంగా నష్ట పోయింది.ఇక్కడికి వచ్చి అక్కడికి పోకుండా ఉండలేరు కదా.తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా భారీగా ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.అందుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

ఆర్ధికంగా ఏపీ చాలా బలహీనంగా ఉంది కాబట్టి కేంద్రం ఉదారంగా ఆదుకోవాలి.వరద నష్టం మీద నివేదికను త్వరలోనే కేంద్రానికి పంపుతామని చంద్రబాబు తెలిపారు.

తాజా వార్తలు