AP BJP MLA Candidates : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజులలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.మే 13వ తారీకు పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.

ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఏపీలో బీజేపీ.

( AP BJP ) తెలుగుదేశం మరియు జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుంది.పొత్తులో భాగంగా పది అసెంబ్లీ మరియు ఆరు పార్లమెంట్ స్థానాల నుండి బీజేపీ పోటీకి దిగుతుంది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేల జాబితా ఏపీ బీజేపీ విడుదల చేయడం జరిగింది.

Advertisement

ఎచ్చెర్ల-ఈశ్వరరావు, విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు,( Vishnukumar Raju ) అరకు వ్యాలీ-రాజారావు, అనపర్తి-శివక్రిష్ణంరాజు, కైకలూరు-కామినేని శ్రీనివాస్,( Kamineni Srinivas ) విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి,( Sujana Chowdary ) బద్వేల్-బొజ్జ రోశన్న, జమ్మలమడుగు-ఆదినారాయణరెడ్డి, ఆదోని-పార్ధసారధి, ధర్మవరం-వై సత్య కుమార్. పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో బీజేపీ-టీడీపీ-జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి.2019లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం జరిగింది.

ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి రావడం తెలిసిందే.కాగా ఇప్పుడు మరోసారి మూడు పార్టీలు కలవడంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.ఇప్పటికే ఈ మూడు పార్టీలకు చెందిన అధినాయకులు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారు.

ఏపీలో ఆల్రెడీ మూడు పార్టీలు కలసి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.ప్రజెంట్ ఎన్నికల సమీపిస్తూ ఉండటంతో.

కేంద్ర బీజేపీ మంత్రులు రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్!
Advertisement

తాజా వార్తలు