న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏయూ వీసీని రీ కాల్ చేయాలి

ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి తీరుపై టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

వెంటనే ఆయనను రీ కాల్ చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

2.సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు.

3.పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

4.తెలంగాణ ఎంసెట్  షెడ్యూల్ విడుదల

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణ ఎంసెట్ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది.ఫిబ్రవరి 28 న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.

5.వైసిపి నాయకులపై కమలానంద భారతి విమర్శలు

దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు స్వామి కమలానంద భారతి నెల్లూరు జిల్లా ఆత్మకూరు శివాలయం ను సందర్శించారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పార్టీ పేరు చెప్పుకుని దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆయన విమర్శించారు.

6.రాజాసింగ్ కామెంట్స్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి.దీనిపై స్పందించిన ఆయన ఆ బెదిరింపులకు తాను భయపడేది లేదని,  ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు.

7.మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సిఐడి సోదాలు

మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహిస్తోంది.మాదాపూర్,  గచ్చిబౌలి,  కొండాపూర్, కూకట్ పల్లిలోని ఇళ్లల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

8.11న ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించునున్న ప్రధాని

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోది మార్చి 11న జాతికి అంకితం చేయనున్నారు.

9.మైసూర్ కోర్టుకు నటి రాఖీ సావంత్

భర్తతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో మైసూర్ కోర్టుకు బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేం రాఖీసావంత్ కోర్టుకు హాజరయ్యారు.

10.టిడిపి జోన్ 2 సమావేశం

టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షన జోన్ 2  కీలక సమావేశం నేడు ఏలూరు సమీపంలోని సోదిమెళ్ళ దగ్గర జరుగుతోంది.

11.కేటీఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

కెసిఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏది అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

12.ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ విధింపు

కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు.కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

13.చంద్రబాబు కామెంట్స్

గన్నవరం టిడిపి కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సందర్శించారు.మొన్న నేను గన్నవరం వద్దామనుకుంటే .రానివ్వరా ? గన్నవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అని చంద్రబాబు మండిపడ్డారు.

14.యాదాద్రిలో గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళ సౌందర్య యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

15.దళిత రచనలపై జాతీయ సదస్సు

గీతం యూనివర్సిటీలో దళితుల రచనలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఈ సదస్సులు జరగనున్నాయి.

16.బి ఆర్ ఎస్ లో చేరిన బెజవాడ మాజీ మేయర్

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

బీఆర్ఎస్ పార్టీలో బెజవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఈ రోజు టిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ లో చేరారు

17.నాదెండ్ల మనోహర్ పర్యటన

ఈరోజు , రేపు తణుకు భీమవరంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు.

18.గని మఠం బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి ఉరవకొండ గనిమట్టం బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.మార్చి ఒకటి నుంచి రథోత్సవం జరుగుతుంది.

19.హరీష్ రావు పర్యటన

Advertisement

నేడు రెండో రోజు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు .పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,510.

తాజా వార్తలు