న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.రాందేవ్ బాబా అరెస్ట్ కు డిమాండ్

రోనా విరుగుడుకు పతాంజలి సంస్థ కొరోనిల్ అని మందులు తయారు చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంగా దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికేట్ ఉందని చెప్పి రాందేవ్ బాబా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని , వెంటనే ఆయనను అరెస్టు చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

2.జగన్ కాన్వాయ్ వెళుతుండగా రైతుల ఆందోళన

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

ఏపీ సీఎం జగన్ మంత్రి వర్గ సమావేశంలో పాల్గొనేందుకు వెలగపూడి సచివాలయం కి వెళ్తున్న సమయంలో మందడం వద్ద రైతులు జై అమరావతి ,విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ, నిరసన తెలియజేశారు.

3.జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి

గుంటూరు కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు ను జనసేన పార్టీ తమ అభ్యర్థిగా ప్రతిపాదించింది.

4.తెలంగాణ ఆర్టీసీ మహిళా కండక్టర్ లకు కొత్త యూనిఫామ్

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

తెలంగాణ ఆర్టీసీ లో మహిళా కండక్టర్ సరికొత్త యూనిఫామ్ అందనుంది.మెరూన్ కలర్ యూనిఫార్మ్ లో మహిళా కండక్టర్ విధులు నిర్వహించనున్నారు.

5.మమత మేనల్లుడు ఇంటికి సీబీఐ అధికారులు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి మంగళవారం ఉదయం సీబీఐ అధికారులు వచ్చారు.కోల్ స్కాం కేసులో ఆయన భార్య రుజిరా బెనర్జీ కి ఇప్పటికే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో నేడు ఆమె విచారించనున్నారు.

6.కేసులకు భయపడేది లేదు : రాజా సింగ్

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు దీనిపై స్పందించిన రాజాసింగ్ తనపై లక్ష కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు.

7.ఓటిటిలోకి ఉప్పెన 7కోట్లకు కొనుగోలు

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించి ఉప్పెన సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 7 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

8.కాంగ్రెస్ నుంచి పాల్వాయి హరీష్ సస్పెండ్

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold
Advertisement

కాంగ్రెస్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పాల్వాయి హరీష్ బాబు ను బహిష్కరించారు.ఈ నెల 23న హరీష్ బీజేపీలో చేరనున్నారు.

9.మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేస్తామని బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ హెచ్చరించారు.

10.ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్.ఆర్.నగర్ ఎస్ఐ భాస్కరరావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

11.విజ్ఞాన్ వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

గుంటూరు సమీపంలోని విజ్ఞాన విశ్వవిద్యాలయం బీటెక్ బి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.మే 24 నుంచి 30 వరకు ఆన్లైన్ లో ప్రవేశ పరీక్ష ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

12.నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్రమంత్రి వర్గం సచివాలయంలో భేటీ అయ్యారు.రాష్ట్రంలో భూ కేటాయింపుల తో పాటు అనేక కీలక అంశాలపై జగన్ సమీక్ష చేపట్టారు.

13.కేరళ సరిహద్దులు మూసివేసిన కర్ణాటక

కేరళలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తగా కేరళ సరిహద్దులను కర్ణాటక మూసివేసింది.

14.6 వేల కోట్ల నష్టాల్లో ఏపీఎస్ఆర్టీసీ

ఏపీఎస్ఆర్టీసీ ఆరు వేల కోట్ల నష్టాల్లో ఉందని ఆర్టీసీ ఎండి ఆర్పి ఠాగూర్ పేర్కొన్నారు.

15.ఎర్రన్నాయుడి కి చంద్రబాబు నివాళులు

టీడీపీ కీలక నేత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

16.డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...

తమిళనాడులోని షోలింగ నల్లుర్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అరవింద్ రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

17.ఒంగోలు ఇటలీ రాయబారి దారుణ హత్య

ఒంగోలు శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఇటలీ రాయబారి లుకా అటాన్సియా దారుణ హత్యకు గురయ్యారు.ఆయనపై సాయిబులు కాల్పులకు తెగబడ్డారు.

18.భారత్ లో కరోనా

Advertisement

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.రెండో దశ లాసెట్ అడ్మిషన్ లు

ఏపీలో లా కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ 2020 రెండోదశ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 25, 26 తేదీల్లో జరగనుంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,470 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,470.

తాజా వార్తలు