న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీలో దీపావళి సంబరాలు పై ఆంక్షలు

ఏపీలో దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చడం పై ఆంక్షలు విధించారు.

దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

2.ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ కోట ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

3.విశాఖ కు పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి పవన్ మద్దతు ప్రకటించనున్నారు.ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద దీక్ష చేస్తున్న కార్మికులు , నిర్వాసితుల శిబిరాలను పవన్ సందర్శించనున్నారు.

4.ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శాఖ తొలగింపు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిర్వహిస్తున్న వాణిజ్య పన్నుల శాఖను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి అప్పగిస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

5.రేపు రాజావిక్రమార్క ట్రైలర్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న థ్రిల్లర్ యాక్షన్ డ్రామా రాజా విక్రమార్క మూవీ ట్రెయిలర్ ను  నవంబర్ 1న విడుదల చేయనున్నారు.

6.సీనియర్ నటుడు కైకాల కు అస్వస్థత

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారి పడ్డారు.దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రి లో చేర్చారు.

7.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.బద్వేల్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం

బద్వేల్ ఉప ఎన్నికలలో మొత్తం 68.37 శాతం ఓటింగ్ నమోదైంది.

9.టిఆర్ఎస్ డీకే అరుణ విమర్శలు

Advertisement

టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు.

10.ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు

ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ విభాగం స్పోర్ట్స్ కోటా ద్వారా వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 27.

11.శ్రీ వారి సేవలో అనిల్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

12.నేడు రేపు ఏపీలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యింది.ఈ ప్రభావం తో నేడు , రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్థాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

13.విద్యార్థుల హాజరు కు బయో మెట్రిక్

ఏపీలో విద్యార్థుల్లో,  నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది.

14.జూలై నుంచి ప్లాస్టిక్ పై నిషేధం

వచ్చే ఏడాది జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుంది అని, ఈ మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది.

15.సిబిఐ డైరెక్టర్కు ఎంపీ రఘురామ లేఖ

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.జగన్ తరఫు న్యాయవాది సుభాష్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై అభ్యంతరం తెలుపుతూ లేఖలో పేర్కొన్నారు.

16.పునీత్ మృతదేహాన్ని ముద్దాడిన కర్ణాటక సీఎం

 కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే పునీత్ రాజ్ కుమార్ మృతదేహాన్ని ముద్దాడి వీడ్కోలు పలికారు.

17.టీఆర్ఎస్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ శశాంక్ గోయల్ కు టీఆర్ఎస్ పై ఫిర్యాదు చేసింది.వీవీ ప్యాడ్ లను ఎన్నికల తరువాత వేరే వాహనంలో తరలించడం పై ఫిర్యాదు చేశారు.

18.టీఆర్ఎస్ పై ఈటెల విమర్శలు

టీఆర్ఎస్ పై ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.నిన్ను పోలింగ్ సందర్భం చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన విమర్శలు గుప్పించారు.

19.షర్మిల పాదయాత్ర

వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 12 వ రోజుకి చేరుకుంది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,740 24.క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,740 .

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు