న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేడో రేపో గ్రూపు-4 నోటిఫికేషన్

 

తెలంగాణలో నేడు లేదా రేపు గ్రూపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు, ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

 2.సీబీఎస్ఈ సిలబస్ లో భారీ మార్పులు  2022- 23 విద్యా సంవత్సరానికి 11, 12 తరగతుల సిలబస్ లో సిబిఎస్సి మార్పులు ప్రకటించింది. 

3.కేటీఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్

  బస్తీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.హైదరాబాద్ కు 85 వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెబుతున్నారని , ఆ నిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

4.ఉచిత విద్యుత్ పై షర్మిల కామెంట్స్

 కెసిఆర్ ప్రభుత్వం పై షర్మిల విమర్శలు చేశారు.రైతులకు ఉచిత కరెంటు అని చెప్పి ఏడు గంటలు మాత్రమే ఇస్తున్నారని షర్మిల విమర్శించారు. 

5.నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు

 ప్రాణహిత పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. 

6.కెసిఆర్తో భేటీ కానున్న ప్రశాంత్ కిషోర్

Advertisement

  ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ రెండో రోజు భేటీ కానున్నారు. 

7.రేపటి నుంచి వేసవి క్రీడ శిక్షణ

 జిహెచ్ఎంసి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 

8.ఉస్మానియా యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ

 రైతు సమస్యల పైన మే 6న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు వస్తున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఏడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తారని టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

9.137 రుణ యాప్ లపై ఆర్బీఐ నిషేధం

 రుణగ్రహీత ఆత్మహత్యలకు కారణం అవుతున్న 137 నకిలీ రుణ యాప్ లతో కూడిన జాబితా విడుదలైంది వీటిని నిషేధిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. 

10.  చలో సీఎం వో కు అనుమతి లేదు

 యూటీఎఫ్  చలో సీఎం కు అనుమతి లేదని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు. 

11.టిఆర్ఎస్ పై బండి సంజయ్ కామెంట్స్

 ఆర్డీఎస్ ఎనిమిదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

12.కేఏ పాల్ కామెంట్స్

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

  24 ఎన్నికల్లో టిఆర్ఎస్ కు కేవలం 30 సీట్లు వస్తాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ జోస్యం చెప్పారు. 

13.ఈ నెల 27న సీఎంలతో ప్రధాని సమావేశం

Advertisement

  భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నారు. 

14.తెలంగాణకు వర్ష సూచన

  రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

15.వైసీపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదు

  ఏపీలో వైసీపీకి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 

16.భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

.ఈ నోటిఫికేషన్ ద్వారా 91 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

17.విశాఖ హెచ్ పీ సీ ఎల్  రిఫైనరీ లో ఖాళీల భర్తీ

  విశాఖ పట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ లో టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 186 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

18.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

19.జమ్ము కాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

 ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి సారి ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -49,990

 

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 53, 440

     .

తాజా వార్తలు