న్యూస్ రౌండప్ టాప్ 20

1.రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 

2.జగన్ ఢిల్లీ పర్యటనపై రఘురామ కామెంట్స్

  ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు కామెంట్స్ చేశారు.ఇది ముఖ్యమంత్రి రుణయాత్రని, రాష్ట్రంలో టీచర్లకు జీతాలు సైతం లేటుగా వస్తున్నాయని, ప్రోగ్రెస్ చూసి అప్పులు ఇవ్వాలని కోరెందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని రఘురామ కామెంట్ చేశారు. 

3.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ప్రధాని తల్లి

 

ప్రధాని నరేంద్ర మోది తల్లి హీరా బెన్ మోది అస్వస్థత కారణంగా అహ్మదాబాద్ లోని యుయన్ మహత ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో బుధవారం చేరారు. 

4.18 మంది టిఆర్ఎస్ సర్పంచ్ ల రాజీనామా

  తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలో కేంద్రం జమ చేసిన నిధులు ఖాళీ అయ్యాయి.15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండా,  వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇతర ఖర్చులకు వాడుకోవడంతో దీనిని నిరసిస్తూ ఆసిఫాబాద్ జిల్లా వాంకాడి మండలంలో 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 

5.ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

 

ప్రధాని నరేంద్ర మోది తో ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

6.జగన్ ఢిల్లీ టూర్ పై లోకేష్ కామెంట్స్

  ఏ వన్ రెడ్డి గారు మరోసారి ఢిల్లీ టూర్ ఎందుకు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశారు. 

7.టిడిపి జాతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

 

Advertisement

టిడిపి జాతీయ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన టిడిపి ఎస్సీ సెల్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 

8.ఈ ఏడాది ఏపీలో క్రైమ్ రేటు తగ్గింది : డిజిపి

  ఏడాది రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

9.కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం

 

కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. 

10.ముంబై టు బెంగళూరు సైకిల్ యాత్ర

  సోమరితనం, కాలుష్య నియంత్రణల పై ప్రజలను జాగ్రత్తపరిచేందుకు ముంబై నుంచి బెంగళూరు నగరం వరకు వేయి కిలోమీటర్ల దూరం వరకు సైకిల్ యాత్రను లైఫ్ లాంగ్ ఆన్లైన్ రిటైల్ సంస్థ సహకారంతో ఓ వ్యక్తి వ్యక్తి పూర్తి చేశారు. 

11.అచ్చెన్న నాయుడు కామెంట్స్

 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు పెడితే అది జగన్ కర్మ అంటూ ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు కామెంట్ చేశారు. 

12.భద్రాచలంలో రాష్ట్రపతి

 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్నారు. 

13.భారత్ జోడో యాత్రకు మంచి స్పందన : ఏపీ కాంగ్రెస్

 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు అన్నారు. 

14.ప్రజా సమస్యలపై చర్చ పెట్టండి - రేవంత్ రెడ్డి

  వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా,  ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు. 

15.ఏజీ 365 డ్రోన్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతి

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

హైదరాబాద్ కు చెందిన మారుతీ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఏజీ 365 డ్రోన్ కు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. 

16.తెలంగాణలో పదో విడత రైతుబంధు

  తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కు పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుబంధు నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. 

17.నకిలీ మద్యం కేసులు కేలక సూత్రధారుల అరెస్టు

 

Advertisement

నకిలీ మద్యం కేసులు కీలక సూత్రధారులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సూపర్ అండి రవీందర్ వెల్లడించారు.నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్ రెడ్డి అలియాస్ శివారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 

18.ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తితో ఉన్నారు : వైసీపీ ఎమ్మెల్యే

  వైసిపి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు చేశారు. 

19.మంత్రి అంబటి పై నాగబాబు కామెంట్స్

 

అన్నయ్య షోకు డుమ్మా.  బాలయ్య షో కు జమ్మ  రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ పై చేసిన కామెంట్స్ కు పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు.ఏయ్ ముందెల్లి పోలవరం సంగతి చూడవోయ్ వెధవ సోది అంటూ నాగబాబు సెటైర్లు వేశారు. 

20.చంద్రబాబు పర్యటన

  టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు ప్రకాశం జిల్లా కందుకూరు లో పర్యటించనున్నారు.

తాజా వార్తలు