న్యూస్ రౌండప్ టాప్ 20

1.సంజయ్ చెప్పుతో కొట్టుకుంటావా : సీపీఐ

ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేయలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటావా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు.

 

2.సోము వీర్రాజు కామెంట్స్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ లో భాగమేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు అన్నారు. 

3.హైదరాబాదులో బుక్ ఫెయిర్

  జాతీయ బుక్ ఫెయిర్ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది.ఈ బుక్ ఫెయిర్ ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 

4.సీనియర్ నటుడు కైకాల మృతి

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందారు.ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

5.చార్లెస్ శోభరాజ్ విడుదల

  సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ దేశం లోని జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. 

6.రాష్ట్రపతి విడుదల కోసం భద్రత ఏర్పాట్లు

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయడానికి ఈనెల 26న వస్తూ ఉండడంతో,  వివిధ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

7.పార్టీ పేరును మార్చాలని రాజ్యసభ చైర్మన్ ఆదేశాలు

  టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ కు టిఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి పార్టీ పేరును  మార్చాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. 

8.11 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర

 

Advertisement

జనవరి 11 నుంచి కర్ణాటకలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినట్లు కాంగ్రెస్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించారు. 

9.కైకాల మృతికి తెలంగాణ గవర్నర్ సంతాపం

  సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందడంపై తెలంగాణ గవర్నర్ తమిళ సై సంతాపం తెలిపారు. 

10.అధికారిక లాంచనాలతో కైకాల అంత్యక్రియలు

 

కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

11.పార్లమెంటు ఉభయ సభల నిరవధిక వాయిదా

  నిర్ణీత షెడ్యూల్ కంటే వారం ముందే పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 

12.నేతలంతా కలిసి పని చేయాలి : దిగ్విజయ్ సింగ్

 

కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి పార్టీ పంథాకు  కట్టుబడి ఉండాలని,  అందరూ కలిసి పని చేయాలని చేతులు జోడించి మరి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. 

13.ఉగ్రవాదుల అరెస్ట్

  జమ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్రకు పాల్పడిన టెర్రరిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 

14.పీవీ నరసింహారావు వర్ధంతి

 

నేడు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి. 

15.తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు

  తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.ఉపాధి హామీ నిధులను కేంద్రం వెనక్కి అడగడంతో జిల్లా కేంద్రాల్లో రైతులతో ధర్నాలు చేపట్టారు. 

16.ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

 

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

రేపు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగునున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. 

17.టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్

  ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింగల్ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత ఈవో ధర్మారెడ్డి తన కుమారుడి మరణంతో 12 రోజులపాటు సెలవులోకి వెళ్లారు. 

18.చిలకలూరిపేట లో జాబ్ మేళా

 

Advertisement

నేడు చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ లో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 

19.సమాచార కమిషనర్ పర్యటన

  నేటి నుంచి మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలో సమాచార కమిషనర్ పర్యటించనున్నారు. 

20.జగన్ పరామర్శలు

 

నంద్యాల తిరుపతి జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ ఈరోజు పర్యటించారు.తుమ్మలగుంట, తిరుపతి జిల్లాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు .అలాగే టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ధర్మ రెడ్డి ని జగన్ పరామర్శించారు.

తాజా వార్తలు