లీక్.. ఆ యంగ్ డైరెక్టర్ తో అనుష్క పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన?

తెలుగు సినీ నటి బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.

తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా అంతగా సక్సెస్ అందుకోలేకపోతుంది.ఇదిలా ఉంటే ఓ యంగ్ డైరెక్టర్ తో అనుష్క పెళ్లి చేసుకొన్నట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.తొలిసారి నటనతోనే మంచి గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఈమె నటించిన అరుంధతి సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement
Anushka Shetty Marriage With Tollywood Young Director Official Announcement Soon

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.ఇక అనుష్క కెరీర్ కొంత వరకు నాశనం కావడానికి సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలే కారణమని చెప్పవచ్చు.

ఈ సినిమాల తర్వాత మళ్లీ మంచి సక్సెస్ అందుకోలేదు అనుష్క.గతంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా నిశ్శబ్దం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

కానీ ఈ సినిమా కూడా అనుష్కను నిరాశపరిచింది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశం అందుకుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకొనుందని తెలుస్తుంది.

Anushka Shetty Marriage With Tollywood Young Director Official Announcement Soon
అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటినుంచి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో అనుష్కను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎన్నోసార్లు ప్రశ్నించారు.కానీ అనుష్క మంచిగా సెటిల్ అయిన తర్వాతనే అని చెప్పి తప్పించుకునేది.

Advertisement

ఇక గతంలో ప్రభాస్ ని కూడా పెళ్లి చేసుకుంటుందని వారి మధ్య లవ్ నడుస్తుందని ఎన్నో పుకార్లు వినిపించాయి.అంతేకాకుండా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా వారికి ప్రశ్నలు ఎదురవ్వగా .కేవలం స్నేహితులమనే చెప్పుకుని తిరిగే వాళ్ళు.కానీ కొన్నాళ్ల తర్వాత వారి మధ్య మంచి స్నేహం ఉందని బయటపడింది.

కానీ ఇప్పటికీ తెలుగు అభిమానులు అనుష్క, ప్రభాస్ ను జంటగా చూడాలని కోరుకుంటూనే ఉన్నారు.కానీ ఈ ముద్దుగుమ్మ మనసులో మరొకరు ఉన్నారని తెలిసింది.

ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్టర్ అని లీకైంది.ఆ డైరెక్టర్ తో అనుష్క రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా చేసింది.ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం పెరిగిందని తెలియగా.

త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గత కొన్ని రోజుల నుండి అనుష్క ఆ డైరెక్టర్ నే పెళ్లి చేసుకుంటుందని నెట్టింట్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు