Samsung M-Series Phone Galaxy : శామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లివే!

శామ్‌సంగ్ తన సరికొత్త M-సిరీస్ ఫోన్ గెలాక్సీ M04ని మరి కొద్ది రోజుల్లో భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.ఈ బడ్జెట్ మొబైల్ రూ.

8,999 ప్రైస్ ట్యాగ్‌తో లాంచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని టేక్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ అప్‌కమింగ్ మొబైల్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుందని అంటున్నారు.

ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఫోన్ ర్యామ్ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.ర్యామ్ ప్లస్‌తో యూజర్లు శామ్‌సంగ్ M04లో 8జీబీ ర్యామ్ వరకు పొందవచ్చని సమాచారం.

ఈ డివైజ్ 5000mAh బ్యాటరీ కెపాసిటీ తో వస్తుందని టాక్ నడుస్తోంది.కొన్ని రోజుల క్రితం ఈ అప్‌కమింగ్ మోడల్ గూగుల్ ప్లే కన్సోల్‌లో లిస్ట్‌ అయింది.

Advertisement

దీన్ని బట్టి మొబైల్ ఇండియాలో అతి త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది.ఫోన్ బ్యాక్‌సైడ్‌లో రెండు కెమెరా సెన్సార్స్‌, ఫ్రంట్ సైడ్ ఓ సెల్ఫీ కెమెరా వాటర్‌డ్రాప్ నాచ్‌లో అందించినట్లు కూడా లీకైన ఫొటోల ప్రకారం తెలుస్తోంది.

ఈ ఫోన్ మీడియాటెక్ ఎంట్రీ-లెవల్ Helio G35 చిప్‌సెట్ సాయంతో పని చేస్తుంది.అంటే ఇది 4G LTE కనెక్టివిటీ మాత్రమే ఆఫర్ చేస్తుంది కానీ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయదు.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై వర్క్ అవుతుంది.దీనిలో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా శాంసంగ్ తన గెలాక్సీ ఎం సిరీస్ ద్వారా ఈ ఏడాది 1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.2019 నుంచి ఇండియాలో 42 మిలియన్లకు పైగా M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు కంపెనీ ఈ ఏడాది జులైలో తెలిపింది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు