చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు.

తాజాగా ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి సినిమా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోతున్నారు.

అనిల్ రావిపూడి ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో(Anil Ravipudi with Megastar Chiranjeevi) సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అనిల్ రావిపూడి ఒక్క ట్వీట్ ద్వారా అన్ని విషయాలను వెల్లడించారు.తాజాగా అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Anil Ravipudi Tweet On Megastar Chiranjeevi Movie , Chiranjeevi, Anil Ravipudi,
Advertisement
Anil Ravipudi Tweet On Megastar Chiranjeevi Movie , Chiranjeevi, Anil Ravipudi,

ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ అయిపోయింది.చిరంజీవి గారికి నా కధలో పాత్ర “శంకర్ వరప్రసాద్” (Shankar Varaprasad)ను పరిచయం చేశాను.  ఆ పాత్రని బాగా ఎంజాయ్ చేసారు.

ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం అంటూ రాసుకొచ్చారు.ఈ ట్వీట్ కి చిరంజీవితో పాటు నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ను  ట్యాగ్ చేసారు.

ఈ ట్వీట్ ద్వారా ఎన్నో విషయాలను తెలియచేశారు.

Anil Ravipudi Tweet On Megastar Chiranjeevi Movie , Chiranjeevi, Anil Ravipudi,

ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిందని ఇందులో చిరంజీవి పాత్ర పేరు శంకర్ వరప్రసాద్ అని తెలిపారు.అంతేకాకుండా ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రారంభం కాబోతుందని వెల్లడించారు.అలాగే ఈ సినిమా ద్వారా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత(Susmitha) గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిర్మాతగా పరిచయం కాబోతున్నారనే విషయాన్ని కూడా అనిల్ రావిపూడి ఈ సందర్భంగా వెల్లడించారు.

సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?
హరీష్ శంకర్ ను పక్కన పెట్టేసిన రామ్ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?

ఇలా చిరు సినిమాకు సంబంధించి ఇన్ని డీటెయిల్స్ తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు