బాలయ్య రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ

నందమూరి బాలకృష్ణ 107వ సినిమా స్పీడ్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ సినిమా కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

వచ్చే నెలలో షూటింగ్ ను ముగించి వెంటనే బాలయ్య తన 108వ సినిమా ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అందులో భాగంగానే బాలయ్య ఇప్పటికే అనిల్ రావిపూడికి కథ ను వినిపించాడని తెలుస్తోంది.

Anil Ravipudi And Balakrishna Nbk 108 Movie Release Date , Anil Ravipudi, Balakr

కథ విషయం లో క్లారిటీ రావడంతో అతి త్వరలోనే సినిమా నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఎఫ్ 3 సినిమా ఒకింత నిరాశ పర్చడంతో అనిల్ రావిపూడికి ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది.

గోపీచంద్‌ మలినేని ఇప్పటికే బాలయ్య ను తాను ఎలా చూపించబోతున్నాడు అనే విషయంలో ఒకింత క్లారిటీ ఇచ్చాడు.ఫస్ట్‌ లుక్ మరియు టీజర్ లు సినిమా స్థాయిని పెంచాయి.

Advertisement

ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి షూటింగ్‌ ప్రారంభం కు ముందే అప్పుడే విడుదల తేదీ గురించిన చర్చలు మొదలు అయ్యాయి.బాలయ్య 107 మరియు 108 సినిమా ల విడుదల తేదీల విషయం లో క్లారిటీ వచ్చింది.

సెప్టెంబర్‌ చివరి వారంలో బాలయ్య .మలినేని గోపీచంద్ ల కాంబోలో రూపొందుతున్న ఎన్‌ బీ కే 107 విడుదల అవ్వబోతుంది.ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప ఆ తేదీని మార్చేది లేదు అంటూ దర్శకుడు గోపీచంద్ చెబుతున్నాడు.

ఇక బాలయ్య 108వ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసి తీరుతాం అంటున్నారు.అయితే సంక్రాంతికి పెద్ద సినిమా లు బోలెడు ఉన్నాయి.కనుక కాస్త 108వ సినిమా విషయంలో అటు ఇటుగా బాలయ్య ఫిల్మ్‌ మేకర్స్ ఉన్నారు.

సంక్రాంతికి సాధ్యం కాకుంటే జనవరి చివరి వారంలో అయినా విడుదల చేస్తామని ఎన్‌ బీ కే 108 మేకర్స్ నుండి స్పందన వస్తోంది.మొత్తానికి బాలయ్య రెండు సినిమా లు కూడా బ్యాక్ టు బ్యాక్‌ అన్నట్లుగా రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కు పండుగే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు