ఇక కేసీఆర్ త్వరలో మరోసారి హామీల వర్షం కురిపించనున్నారా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సంచలన మార్పులతో ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే చాలా వరకు అనాధికారికంగా ఎన్నికల వాతావరణం అనేది మొదలైందని చెప్పవచ్చు.

అయితే చాలా వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుండే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.అందులో భాగంగా అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ముందుకు సాగుతున్న తరుణంలో కేసీఆర్ కూడా అంతర్గతంగా వ్యూహం పన్నుతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఇక పలు కీలక హామీలను నెరవేర్చే దిశగా ముందుకు కదలడమే కాక సరికొత్త హామీల వర్షం కురిపించేందుకు సిద్దమవుతున్న పరిస్థితి ఉంది.అయితే సాధ్యమైనంత వరకు ముచ్చటగా మూడో సారి కూడా టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే రానున్న రోజుల్లో రాజకీయంగా ఉండే పరిస్థితులను బట్టి చాలా వినూత్నమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే వచ్చే సారి కెసీఆర్ అధికారంలోకి వస్తే ఇక టీఆర్ఎస్ ను అధికారంలో నుండి దించేయడం అంత సులభమైన విషయం కాదు అందుకే కెసీఆర్ ఇక ప్రజాకర్షక హామీలను ఇచ్చి టీఆర్ఎస్ వైపు ప్రజల దృష్టి మరల్చేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

Advertisement

ఇప్పటికే జిల్లాల పర్యటనకు కార్యాచరణ రూపొందించుకున్న కేసీఆర్ అనివార్య కారణాల వల్ల కొంత అలస్యమైనా తరువాత మరల జిల్లాల పర్యటన చేపడతారని అందరూ భావించినా ఇక ఒమిక్రాన్ విజృంభణతో కేసీఆర్ జిల్లాల పర్యటనపై సందిగ్ధత నెలకొంది.అయితే మరి రానున్న రోజుల్లో జిల్లాల పర్యటన నిరవధికంగా వాయిదా పడితే టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి కేసీఆర్ సరికొత్త హామీలకు ఏ మేరకు ప్రజలు ఆకర్షితులు అవుతారనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు