అనసూయ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతోందా?

జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా మోస్ట్‌ పాపులర్ యాంకర్ అంటూ పేరు దక్కించుకోవడం తో పాటు హీరోయిన్‌ రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా మంచి పేరును సొంతం చేసుకునేందుకు పలు సినిమాల్లో నటించింది.

కానీ నటిగా లభించినంత పేరు హీరోయిన్‌ గా దక్కలేదు అనడంలో సందేహం లేదు.హీరోయిన్‌ గా ఈ మధ్య కాలంలో సినిమాలు చేసేందుకు భయపడుతున్న అనసూయ( Anasuya ) క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలను చేస్తుంది.

ఇప్పటికే హీరోయిన్‌ పాత్రలు మానేసిన ముద్దుగుమ్మ అనసూయ ఇకపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అది కూడా హీరోలకు హీరోయిన్స్ కు సిస్టర్ పాత్రల్లో నటించేందుకు ఓకే చెప్పేందుకు సిద్ధం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనసూయ సెకండ్‌ ఇన్నింగ్స్ కి సంబంధించిన హడావుడి నేపథ్యంలో త్వరలోనే ఒక యంగ్‌ హీరో సినిమాలో ముద్దుగుమ్మ సిస్టర్ పాత్రలో కనిపించబోతుంది.

సాధారణంగా తెలుగు సినిమా ల్లో సిస్టర్ పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.మరి అనసూయ చేసేందుకు ఓకే చెప్పింది కనుక ఆ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండి ఉంటుందా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా( Social media )లో జబర్దస్త్‌ కార్యక్రమానికి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

Advertisement

ఆ షో నుండి అనసూయ తప్పుకోవడం పెద్ద తప్పు అంటూ ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అనసూయ అలా చేయడం వల్లే ఆమెకు ఆఫర్లు తగ్గాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఆమెను ఇంకా జబర్దస్త్‌( Jabardasth ) తో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా జనాలు వద్దని అనుకుంటున్నారా అంటే ఔను అనే సమాధానం వస్తుంది.

హీరోయిన్‌ గా అనసూయ కు దక్కని గుర్తింపు నటిగా ముందు ముందు లభిస్తుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు