Amitabh Bachchan : అమితాబ్-జయాబచ్చన్‌ల మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకే..

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్‌ బచ్చన్ ( Amitabh Bachchan )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చాలా ఏళ్లుగా ఈ హీరో బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీ ని ఏలేసాడు.

చిరంజీవి రేంజ్ లో హిందీలో బిగ్ బి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

వయసు పైబడినా సరే మంచి పాత్రలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.కల్కి సినిమాలో ఈ నటుడు ప్రస్థానం యాక్ట్ చేస్తున్నాడు.

కౌన్ బనేగా కరోడ్‌పతి షో( Kaun Banega Crorepati Show ) ద్వారా కోట్లాదిమంది ప్రేక్షకుల మనసుల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు.ఈ దిగ్గజ నటుడికి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

అమితాబ్‌ బచ్చన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లకు పైగానే సమయం గడిచిపోతుంది.

Amitab And Jaya Bachchan Family Property
Advertisement
Amitab And Jaya Bachchan Family Property-Amitabh Bachchan : అమితాబ�

ఆ 50 ఏళ్లలో ఆయన నటించిన సినిమాలు ఎన్నో.స్టార్డమ్ వచ్చిన తర్వాత అనేక కంపెనీలకు ప్రచారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించాడు.బ్రాండ్ అంబాసిడర్( Brand ambassador ) గా కూడా కొనసాగాడు.

అనేక బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ చాలా డబ్బులు వెనకేశాడు.అమితాబ్‌ బచ్చన్ ఫ్యామిలీ గత కొన్ని దశాబ్దాలలో చాలా డబ్బులు సంపాదించిందని అంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ప్రకారం బిగ్ బీ సతీమణి జయ బచ్చన్ ( Jaya Bachchan )కూడా కోట్లు సంపాదించింది.ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ కు సంబంధించి తాజాగా ఒక రిపోర్టు వైరల్ గా మారింది.

ఇప్పుడే ఆ విషయం ఎందుకు బయటకు వచ్చిందంటే, సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు పోటీ చేస్తోంది.

Amitab And Jaya Bachchan Family Property
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇందులో భాగంగా ఇటీవల అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తి వివరాలను ఎంటర్ చేయాల్సి వచ్చింది.అయితే ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అక్షరాలా రూ.10.11 కోట్లు.ఇది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు.ఇక అమితాబ్‌ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏకంగా రూ.120 కోట్లు ఉందట.కేవలం బ్యాంకుల్లోనే ఇన్ని కోట్లు ఉన్నాయంటే వారి స్థిరాస్తులు ఇంకెన్ని కోట్ల విలువ పలుకుతాయో అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.జయాబచ్చన్ – అమితాబ్‌ బచ్చన్ దంపతులకు మొత్తం రూ.170 కోట్ల విలువైన ప్రాపర్టీస్, ఇతర ఆస్తులు ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.2018లో విడుదలైన ఒక రిపోర్ట్ ప్రకారం వీరి ఆస్తి రూ.1,000 కోట్లు దాటేసింది.ఐదేళ్లలో మరో 500 కోట్లు వారు సంపాదించినట్టు తెలుస్తోంది.

Advertisement

సినిమాలు, బ్రాండ్ ప్రొడక్ట్స్ ప్రమోషన్స్ ద్వారా బిగ్ బీ బాగా సంపాదించినట్లు సమాచారం.ఏది ఏమైనా వీరి ఆస్తులు గురించి తెలుసుకొని చాలామంది నోరెళ్ల బెడుతున్నారు.

తాజా వార్తలు