అమెరికాలో నాట్స్ ముగ్గుల పోటీ...!!!

సొంత ఊళ్ళని విడిచి ఖండాంతరాలు వివిధ దేశాలలో స్థిరపడిన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నాసరే తెలుగు సంస్కృతిని సాంప్రదాయలని మాత్రం మర్చిపోరు.

తమకి దొరికే కొద్ది పాటి తీరిక సమయాలని తెలుగువారందరూ కలిసి ఎదో ఒక రూపంలో మన సంస్కృతిని బ్రతికించుకునేలా, తమ పిల్లలకి సాంప్రదాయాలు తెలుసుకునేలా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు.

అందులో భాగంగానే.అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీలలో తమ కళాత్మకతని చూపెట్టారు.

మే నెలలో డాలస్ వేదికగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకంగా ముందస్తుగానే ఈ పోటీలని నిర్వహిస్తూ వస్తోంది నాట్స్.దాంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తూ వస్తోంది.

అయితే ఈ పోటీలలో చాలా మంది మహిళలు తమ సృజనాత్మకతనని చూపించారు.నాట్స్ నినాదమయిన ‘భాషే రమ్యం సేవే గమ్యం’ కి దగ్గరగా ఉండే ఓ ముగ్గుని పరిశీలించిన ఎంపిక బృందం ఆ ముగ్గు వేసిన ఆలూరు గాయత్రి కి మొదటి బహుమతిని అందించింది.

Advertisement

అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రతిబింబిస్తూ వేసిన మరొక ముగ్గుకి రెండవ బహుమతి దక్కింది.

ట్రంప్‌కు సిలికాన్ వ్యాలీ సపోర్ట్.. వాళ్లతో కలిసి పనిచేస్తా : భారత సంతతి క్యాపిటలిస్ట్
Advertisement

తాజా వార్తలు