ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో డ్రాగ‌న్ ఫ్రూట్ ను తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన సమయం.ఆ టైంలో ఏం తినాలి.

ఏం తినకూడదు.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు.కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు చాలా కేర్ తీసుకుంటారు.

అయితే మామూలు సమయంతో పోలిస్తే ప్రెగ్నెన్సీ ( Pregnancy )టైంలో తల్లికి మరియు కడుపులోని శిశువుకు అనేక పోషకాలు అవసరం అవుతాయి.అవన్నీ అందించాలంటే కచ్చితంగా డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.

Advertisement

అయితే అటువంటి ఆహారాల్లో డ్రాగన్ ఫ్రూట్( Dragon fruit ) ఒకటి.దీనిలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్ వంటి మినరల్స్‌ తో పాటు విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్‌, ఫైబర్ వంటి పోషకాలు డ్రాగన్ ఫ్రూట్ లో మెండుగా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్ ద్వారా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పొందవచ్చు.ప్రెగ్నెన్సీ సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కడుపులోని శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధికి విటమిన్ బి12 ముఖ్యపాత్రను పోషిస్తుంది.అయితే డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.

అందువల్ల ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు డ్రాగన్ ఫ్రూట్ ను కచ్చితంగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరి మహిళలకు ఏ వాసన పడదు.ముఖ్యంగా పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు.అయితే పాలకు బదులుగా డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకుంటే అందులో ఉండే క్యాల్షియం దీని ద్వారా భర్తీ చేయవచ్చు.

Advertisement

డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.డ్రాగన్ ఫ్రూట్( Dragon fruit ) ను రోజు తీసుకుంటే జీర్ణవ్యవస్థ చురుగ్గా సాగుతోంది.అజీర్తి, మలబద్ధకం,( Constipation ) గ్యాస్ వంటి సమస్యలు వేధించకుండా ఉంటాయి.

ప్రెగ్నెన్సీ టైం లో ఎక్కువ శాతం మంది రక్తహీనత( anemia ) బారిన పడుతుంటారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది.డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

రక్తహీనతను తరిమి కొడుతుంది.అంతే కాదు డ్రాగన్ ఫ్రూట్ ( Dragon fruit )రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా సైతం మెరిపిస్తుంది.

తాజా వార్తలు