చివరి వారం లో కూడా అమర్ ని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్..స్నేహితులు కూడా చులకన చేస్తున్నారుగా!

మన కంటి ముందు ఏ మనిషిని అయినా ప్రతీ చిన్న విషయానికి టార్గెట్ చేస్తే మన మనసులకు చాలా బాధ అనిపిస్తాది.

మన చుట్టూ పక్కన అలాంటి పరిస్థితులు వస్తే కచ్చితంగా స్పందిస్తాము, ఇక రియాలిటీ షోస్ లో అలాంటి పరిస్థితి వస్తే ఆ టార్గెట్ చేసిన కంటెస్టెంట్ ని హీరోని చేస్తాము.

మన తెలుగు ఆడియన్స్ ఒక రేంజ్ లో ఇష్టపడే రియాలిటీ షో బిగ్ బాస్.ఇప్పటి వరకు 7 సీజన్స్ ని జరుపుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో సీజన్ 2 కౌశల్ ని హౌస్ మేట్స్ అందరూ ఏ రేంజ్ లో టార్గెట్ చేసారో, సీజన్ 7 లో అమర్ దీప్ ని కూడా అదే రేంజ్ లో టార్గెట్ చేసారు.ప్రస్తుతం చివరి వారం నడుస్తుంది.

ఈ చివరి వారం లో కూడా హౌస్ మేట్స్ అమర్ దీప్( Amardeep ) ని టార్గెట్ చెయ్యడం ఆయన అభిమానులకు ఎంతో బాధని కలిగించింది.

Amardeep Was Targeted By The House Mates In The Last Week As Well Even Friends A

విషయం లోకి వెళ్తే ఈరోజు బిగ్ బాస్ ఇప్పటి వరకు జరిగిన అన్నీ ఎపిసోడ్స్ లో యావరేజి గా ఒక్కో కంటెస్టెంట్ కి ఎంత స్క్రీన్ టైం ఉంటుందో చెప్పమని హౌస్ లో ఉన్నవారిని అడుగుతాడు బిగ్ బాస్.అందరూ ఊహించినట్టుగానే స్పై బ్యాచ్, అనగా శివాజీ( Shivaji ) బ్యాచ్ అమర్ దీప్ కి కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.చివర్లో అర్జున్ మాత్రం అమర్ కి 20 నిమిషాల స్క్రీన్ టైం ఉంటుంది అని అమర్ మెడలో బ్యాడ్జి వేస్తాడు.

Advertisement
Amardeep Was Targeted By The House Mates In The Last Week As Well Even Friends A

అప్పుడు శివాజీ అమర్ వైపు చూస్తూ నీకు 20 నిమిషాలు ఏందిరా, నాకు అసలు అర్థం కావడం లేదు అని అంటాడు.ఆ తర్వాత అమర్ గురించి అర్జున్ చెప్తూ వాడికంటే ఫౌల్ గేమ్స్, దొంగతనాలు ఇలా అమర్ ని తక్కువ చేస్తూ చెప్తుండగా, అమర్ ఇక చాలు ఆపవయ్యా అని అంటాడు.

అప్పుడు శివాజీ ఎహే.చెప్పమను.నీకేంటి అని అంటాడు.

Amardeep Was Targeted By The House Mates In The Last Week As Well Even Friends A

అప్పుడు అమర్ దీప్ నాకు గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదు అని అనగా, శివాజీ నీ గొప్పలు చెప్పట్లేదు, వెదవ అని అంటున్నాడు అని అంటాడు.ఇదంతా ఫన్నీ గానే చూసారు కానీ, అమర్ దీప్ మాత్రం లోపల చాలా బాదపడినట్టుగా అనిపించింది.ఇక మొదటి వారం నుండి తనతో కలిసి ఆడిన ప్రియాంక( Priyanka Jain ) కూడా అమర్ ని చులకనగా చూడడం ప్రారంభించడం తో లోపల అమర్ దీప్ ఏ స్థాయిలో మానసిక క్షోభ కి గురి అయ్యుంటాడో అర్థం చేసుకోవచ్చు.

మొదటి 5 వారాల్లో రెండు వారాలు ఫౌల్ గేమ్ ఆడాడు అని, సీజన్ మొత్తం అతను ఫౌల్ గేమ్ ఆడినట్టు ముద్ర వేసేసారు.కష్టపడి కెప్టెన్సీ టాస్కులలో రెండు వారాలు చివరి వరకు వస్తే, హౌస్ మేట్స్ కుట్రలు చేసి కెప్టెన్ ని అవ్వనివ్వకుండా చేసేసారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

చివరికి నాగార్జున ఎదో ముష్టి వేసినట్టు వేసి అమర్ గౌరవం ని మరింత తగ్గించాడు.ఇన్ని అవమానాల మధ్య సాగిన అమర్ జర్నీ కప్పుని అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు