చిరుకు బన్నీ థ్యాంక్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ‘రుద్రమదేవి’ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

చిత్ర దర్శకుడు గుణశేఖర్‌పై ఉన్న అభిమానంతో ఈ సినిమాలకు చిరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం జరిగింది.

చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ సినిమాకు మరింత బలంను తీసుకు రావడం ఖాయం అని చిత్ర దర్శకుడు మరియు ఇతర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు.తాజాగా మెగా హీరో అల్లు అర్జున్‌ కూడా ఈ సినిమాకు చిరు వాయిస్‌ ఓవర్‌ తప్పకుండా హెల్ప్‌ అవుతుందని, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినందుకు మెగాస్టార్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌ అంటూ తక కృతజ్ఞతలను చిరుకు చెప్పాడు.

అల్లు అర్జున్‌ ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డిగా కనిపించనున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలో మెగాస్టార్‌ కూడా పార్ట్‌ అయినందుకు ఆయన తన సంతోషాన్ని కృతజ్ఞతలు చెప్పి పేర్కొన్నాడు.

ఈ సినిమా నిన్న మొన్నటి వరకు ఈనెల 26న విడుదల కాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టుకు వాయిదా పడ్డట్లుగా చెబుతున్నారు.

Advertisement

ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా రానా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.భారీ బడ్జెట్‌తో కాకతీయుల కళా వైభవం కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు గుణశేఖర్‌ ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ రికార్డు ఎన్టీఆర్ పేరిటే ఉంది.. ఏ హీరోకి సాధ్యం కాలేదు?
Advertisement

తాజా వార్తలు