రోడ్డు ప్రమాదానికి గురైన అల్లరి నరేష్ హీరోయిన్! లాక్ డౌన్ ని బ్రేక్ చేసి

దేశం మొత్తం మీద లాక్ డౌన్ ఉన్న సమయంలో కూడా కొంత మంది దానిని బ్రేక్ చేసి దూర ప్రాంతాలకి వెళ్తున్నారు.

ఇలా చేసేది సామాన్యులు అయితే చెప్పొచ్చు కాని సెలబ్రిటీలు కూడా ఇదే పంథా అనుసరిస్తే దానిని ఉపేక్షించడం చాలా కష్టం.

అయితే ఇలా లాక్ డౌన్ అతిక్రమించి రోడ్డు ప్రమాదాలకి గురై తెలంగాణ రెండు చోట్ల పది మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అలాంటి పరిస్థితి సౌత్ హీరోయిన్ కి ఎదురైంది.

Allari Naresh Heroine Road Accident In Bangalore, Lock Down, Bangalore, South He

అల్లరి నరేశ్ సరసన కెవ్వుకేక చిత్రంలో నటించిన కన్నడ భామ షర్మిలా మాండ్రే ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడింది.కన్నడనాట పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా కొనసాగుతున్న షర్మిల లాక్ డౌన్ రూల్స్ ని అతిక్రమించి తన స్నేహితుడు లోకేశ్ వసంత్ తో కలిసి ఓ కారులో ప్రయాణిస్తుండగా బెంగళూరు వసంత్ నగర్ లో ప్రమాదం జరిగింది.

వీరు ప్రయాణిస్తున్న కారు ఓ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.దాంతో కారు ముందుభాగం ఓవైపు నుజ్జునుజ్జయింది.

Advertisement

వేకువజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వారిద్దరూ కారులో ఎందుకు బయటికి వచ్చారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

వీరిద్దరూ సరదాగానే కారులో షికారుకు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

గాయాలపాలైన షర్మిల, లోకేశ్ లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?
Advertisement
Allari Naresh Heroine road Accident, Sharmila Mandre, Lock Down, Bangalore

తాజా వార్తలు