Kartik Aaryan Shehzada: అలా వైకుంఠపురంలో సినిమా రీమేక్.. బన్నీని గుడ్డిగా ఫాలో అయిపోయిన బాలీవుడ్ నటుడు?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీల హీరోలు కూడా రీమేక్ సినిమాలలో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఒక బాషలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు రీమేక్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రీమేక్ సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ప్రమాదకరంగా మారింది.

ఎందుకంటే ప్రేక్షకులు రీమేక్ సినిమాకి ఒరిజినల్ సినిమాకి మధ్య పోలికలు వెతుకుతూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.అయితే ఇటువంటి కష్ట సమయంలోనే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురములో సినిమాను హిందీలో రీమేక్ చేశారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఈ సినిమా విషయంలో వాగ్వాదాలు వివాదాలు చోటుచేసుకున్నాయి.

Advertisement
Ala Vaikunthapurramuloo Hindi Remake Shehzada Teaser Out Kartik Aaryan Vs Allu A

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడంతో అలా వైకుంఠపురములో సినిమాను కూడా రీమేక్ చేసి హిందీలో విడుదల చేయాలని అనుకున్నారు.కానీ కార్తీక్ ఆర్యాన్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.

అలా గనుక ఇక్కడ రిలీజ్ చేస్తే ఈ సినిమాను ఇక నేను చేయను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు.ఇక మొత్తానికి హిందీలో ఈ సినిమా డబ్ చేయాలనే ఆలోచనను అంతా విరమించుకున్నారు.

అయితే తాజాగా కార్తీక్ ఆర్యాన్ పుట్టినరోజు సందర్బంగా ఈ రీమేక్ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

Ala Vaikunthapurramuloo Hindi Remake Shehzada Teaser Out Kartik Aaryan Vs Allu A

ఇందులో భాగంగా టీజర్‌లోని ప్రతీ షాట్‌ను నెటిజన్లు ఒరిజినల్‌ తో పోలుస్తున్నారు.అయితే ఒరిజినల్‌ లో ఉన్న ఫీల్, బన్నీలోని స్టైల్, యాటిట్యూడ్, ఆ కొత్తదనం మాత్రం రీమేక్‌ లో కనిపించక పోవడంతో నెటిజన్స్ కూడా కార్తీక్ ఆర్యాన్‌ను పై మండిపడుతున్నారు.అసలు రీమేక్ చేయకుండా ఉండాల్సింది కదా? అంటూ సలహాలు ఇస్తున్నారు.ఇకపోతే సినిమాలో సిత్తరాల సిరపడు టైంలో వచ్చిన సీన్లను రీమేక్‌లో రైల్వే స్టేషన్‌లో పెట్టినట్టు కనిపిస్తోంది.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

ఇంట్లోకి మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చే సీన్‌లోనూ అంత ఎఫెక్టివ్‌గా చూపించినట్టు అనిపించడం లేదు.ఇక ఫస్ట్ ఫైట్‌ పోర్ట్ ఏరియాలో ఉండే ఫైట్‌ను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా తీసినట్టు కనిపిస్తోంది.

Advertisement

ఇక హీరోయిన్‌, హీరో మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా కుదిరినట్టు అనిపించడం లేదు.అలాగే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మైనస్‌ లా కనిపిస్తోంది.మరి బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారా లేదా చూడాలి మరి.

తాజా వార్తలు