Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు నటించిన టాప్ టెన్ క్లాసిక్ మూవీస్ ఇవే…!

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) ఎలాంటి పాత్రలో అయిన అద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోస్తారు.70 ఏళ్ల నట జీవితంలో ఆయన నటించని పాత్ర లేదు.

అందుకొని పురస్కారం లేదు.

అలాంటి ఏఎన్ ఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచిన 10 మెమరబుల్ సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• బాలరాజు:

జానపద చిత్రం బాలరాజులో( Balaraju Movie ) టైటిల్ పాత్రలో నటించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు ఏఎన్ఆర్.ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో తొలి సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ కావడం విశేషం.అలానే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచి రికార్డు సాధించింది.

• దేవదాసు:

అక్కినేని నాగేశ్వరావ్ కెరీర్ లోనే మరపురాని సినిమా గా ఉండిపోయింది దేవదాసు సినిమా.( Devadasu Movie ) దేవదాస్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారని చెప్పాలి.ఈ సినిమాతో నాగేశ్వరరావు కి ఉన్న అభిమానుల సంఖ్య మరింత పెరిగిపోయింది.

Advertisement

ఈ సినిమాకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు.

• మాయాబజార్:

తెలుగు ప్రేక్షకులకు నాగేశ్వరావు నటించిన అత్యంత ఇష్టమైన చిత్రాల్లో మాయాబజార్( Mayabazar Movie ) ఒకటి.ఈ సినిమాలో అభిమన్యుడి పాత్రలో ఆకట్టుకున్నారు ఏఎన్ఆర్.ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

• సువర్ణ సుందరి:

వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన జానపద చిత్రమే సువర్ణ సుందరి సినిమా. అప్పట్లో ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ లోనూ తన అభినయంతో రంజింపజేశారు ఏయన్నార్.

• గుండమ్మ కథ:

తెలుగు సినీ ప్రేమికులను ఎంతగానో అలరించిన సాంఘీక చిత్రాల్లో గుండమ్మ కథ సినిమా( Gundamma Katha Movie ) కూడా ఒకటి.ఈ సినిమా లో గుండమ్మ పాత్రలో సూర్యకాంతం అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అక్కినేని.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

కమలాకర కామేశ్వరరావు ఈ సినిమా కి దర్శకత్వం వహించారు.

• మూగ మనసులు:

Advertisement

పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ క్లాసిక్ మ్యూజికల్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇందులో గోపి పాత్రలో తన నటనతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు అక్కినేని.ఈ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేశారు.

• దసరా బుల్లోడు:

వీబీ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో దసరా బుల్లోడి పాత్రలో ప్రేక్షకులను అలరించాడు నాగేశ్వరావు.ఇక ఈ సినిమా లో "పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల" పాటలో తన చిందులతో కనువిందు చేశారు.

• ప్రేమ నగర్:

ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన అక్కినేని నుంచి వచ్చిన అద్భుత చిత్రమే ప్రేమ నగర్.( Prem Nagar Movie ) సురేశ్ ప్రొడక్షన్స్ స్థాయిని పెంచిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ ని కె.యస్.ప్రకాశ రావు రూపొందించారు.

• ప్రేమాభిషేకం:

527 రోజుల పాటు ఆడిన క్లాసిక్ లవ్ స్టోరీ ప్రేమాభిషేకం. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ విషాద ప్రేమ కథ సినిమా లో తన నటనతో విశేషంగా అలరించారు అక్కినేని.ఈ సినిమాని దాసరి నారాయణ రావు రూపొందించారు.

• సీతారామయ్య గారి మనవరాలు:

తెలుగు ప్రజలను విశేషంగా అలరించిన కుటుంబ కథా చిత్రమిది.ఇందులో ఎలాంటి విగ్గు లేకుండా తాతయ్య పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నారు ఏయన్నార్.క్రాంతి కుమార్ తీర్చిదిద్దిన ఈ సినిమా సీతారామయ్యగా అక్కినేని అలరించారు.

తాజా వార్తలు