అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) తనయుడు అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాగార్జున తనయుడిడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తెలుగులో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.

దాంతో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్.ఇకపోతే అఖిల్ కొంగతంలోనే ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.

కానీ కొన్ని కారణాలవల్ల అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది.ఇక గత ఏడాది తన అన్నయ్య నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి తేదీ నిశ్చయమైన కొద్ది రోజులకే అఖిల్ అలాగే జైనాబ్ రవద్జీ ఎంగేజ్మెంట్ ( Zainab Rawadji Engagement )వేడుక జరిగిన విషయం తెలిసిందే.

Akkineni Akhil Marriage Date Fix, Akkineni Akhil, Zainab Rawadji , Marriage Dat

ఎలాంటి హంగులు అర్బరాలు లేకుండా సింపుల్ గా ఎంగేజ్మెంట్ వేడుకలు జరిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.కాగా నాగ చైతన్య,శోభిత ( Naga Chaitanya, Sobhita )ల పెళ్లి డిసెంబర్ 5 న జరిగిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆలోచనలు కన్ను అంతా కూడా అఖిల్ పెళ్లి పై బడింది.

Advertisement
Akkineni Akhil Marriage Date Fix, Akkineni Akhil, Zainab Rawadji , Marriage Dat

జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ వెడ్డింగ్ తేదీపై అందరిలో క్యూరియాసిటీ నడుస్తోంది.అంతేకాదు ఈ మధ్యన అఖిల్ చాలా సీక్రెట్ గా తన కొత్త ప్రాజెక్ట్ పైకి వెళ్లిపోయాడని, వినరో భాగ్యము దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా మొదలు పెట్టాడని అన్నారు కానీ అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మమేషన్ రాలేదు.

తాజాగా అఖిల్ జైనాబ్ రవద్జీ పెళ్లి తేదీ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

Akkineni Akhil Marriage Date Fix, Akkineni Akhil, Zainab Rawadji , Marriage Dat

మార్చి 24న అక్కినేని వారసుడు అఖిల్,జైనల్‌ల వివాహం ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం.అఖిల్ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను అక్కినేని, జైనాబ్ కుటుంబ సభ్యులు కలిసి చూసుకోబోతున్నారట.అఖిల్ పెళ్లిని అంగరంగ వైభవముగా నిర్వహించేందుకు నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, అఖిల్, జైనాబ్ పెళ్ళికి బిజినెస్ పర్సన్స్‌ తో పాటు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

ఏం మాయ చేసావే ఎప్పటికీ ప్రత్యేకమే... మొదటి సినిమాని గుర్తు చేసుకున్న సమంత!
Advertisement

తాజా వార్తలు