జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashant Verma ) దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన చిత్రం జాంబిరెడ్డి( Zombie Reddy ).ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Zombie Reddy Movie Sequal, Zombie Reddy, Sequal, Tollywood, Prashanth Varma, Tej-TeluguStop.com

అప్పటివరకు ప్రేక్షకులకు జనాలకు పరిచయం లేని ఒక కొత్త సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమా విడుదల తర్వాత ఈ సినిమా తరహాలోనే చాలా రకాల ప్లే గేమ్స్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే.

జాంబీస్ అనే పదం ప్రేక్షకులలో బాగా గుర్తుండిపోయింది.ఇకపోతే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది.

Telugu Prashanth Varma, Sequal, Teja Sajja, Tollywood, Zombie Reddy, Zombiereddy

ఇప్పటికే అందుకు సంబంధించిన వార్తలు కూడా చాలా సార్లు వినిపించిన విషయం తెలిసిందే.జాంబిరెడ్డికి సీక్వెల్ కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తయారు చేసారు.అయితే కథ మాత్రమే ఇవ్వగలరు తప్ప దర్శకత్వం కానీ, పర్యవేక్షణ కానీ చేసే పరిస్థితిలో మాత్రం ప్రశాంత్ వర్మ లేరు.అందుకు గల కారణం ఆయనకు వేరే కమిట్మెంట్లు ఉండడమే.

అందువల్ల ఈ కథను తీసుకుని వేరే దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలు జరుగుతున్నాయి.ఈసారి ఈ ప్రాజెక్ట్ ను సితార సంస్థ ( Sitara Company )టేకప్ చేస్తుంది.

సరైన దర్శకుడు దొరికిన తరువాత, స్క్రిప్ట్ వర్క్ మొదలైన తరువాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందనీ తెలుస్తోంది.

Telugu Prashanth Varma, Sequal, Teja Sajja, Tollywood, Zombie Reddy, Zombiereddy

ఇకపోతే హీరో తేజ( Hero Teja ) ప్రస్తుతం మిఠాయి అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మరో 25 రోజుల్లో పూర్తి కానుంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గుజరాత్లో జరుపుకుంది.

నేపాల్ షెడ్యూల్ మొదలు కాబోతోంది.ఆ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే హీరో తేజ జాంబిరెడ్డి సీక్వెల్ సినిమా పనులను మొదలుపెట్టనున్నారు.

ఇప్పటికే గతంలో విడుదలైన జాంబిరెడ్డి సినిమా పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు పార్ట్ 2 కూడా రాబోతోంది.

ఇది కూడా సూపర్ హిట్ అవడం ఖాయం అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube