సామాన్యుల కోసం ఎయిడ్స్‌ బాధితుల హోటల్‌.. ప్రపంచంలోనే అరుదైన ఈ హోటల్‌ ప్రత్యేకతలు ఏంటో తెలుసా

ఎయిడ్స్‌ రోగం అనేది అత్యంత ప్రమాదకర వ్యాది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎయిడ్స్‌ ఒక సారి ఎటాక్‌ అయ్యిందంటే మరణమే అనే విషయం తెల్సిందే.

అయితే ఈమద్య కాలంలో ఒక్కరు ఇద్దరు ఎయిడ్స్‌ నుండి పూర్తిగా రికవరీ అయిన మాట వాస్తవమే కాని, ఎయిడ్స్‌కు పూర్తి స్థాయిలో మందు అయితే కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు విజయవంతం అవ్వలేదు.అందుకే భయంకర ఎయిడ్స్‌ వ్యాది అంటే ప్రపంచమే భయపడుతోంది.

అందుకే ఎయిడ్స్‌ వ్యాది అంటు వ్యాది కాకున్నా కూడా చాలా మంది ఎయిడ్స్‌ వ్యాది గ్రస్తులకు చాలా దూరంగా ఉండాలని భావిస్తున్నారు.

ఎయిడ్స్‌ రోగంతో చాలా మంది ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే కూడా ఎవరికి ఇష్టం ఉండదు.అలాంటిది మొత్తం ఎయిడ్స్‌ రోగులతో కూడిన ఒక హోటల్‌ కోల్‌కత్తాలో ఉంది.ఆ హోటల్‌లో పని చేసే వారు అంతా కూడా ఎయిడ్స్‌ రోగస్తులే.

Advertisement

అయితే వారు వారి స్వయం అపరాదం వల్ల ఎయిడ్స్‌ జబ్బును పొందలేదు.వారి తల్లిదండ్రుల నుండి ఆ జబ్బును పొందారు.

ఎయిడ్స్‌ వల్ల తల్లిదండ్రుల నుండి దూరం కాబడిన కొందరు పిల్లలు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పెరుగుతున్నారు.వారికి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆఫర్‌ అనే ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి వారికి జాబ్స్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

ఆఫర్‌ స్వచ్చంద సంస్థ ద్వారా కోల్‌కత్తాలోని ఒక పార్క్‌ సమీపంలో హోటల్‌ను కేఫ్ పాజిటివ్ అనే పేరుతో ఏర్పాటు చేశారు.ఆ హోటల్‌లో పది మంది ఎయిడ్స్‌ వ్యాదిగ్రస్తులైన యువతి యువకులు పని చేస్తున్నారు.అయితే ఎయిడ్స్‌ వ్యాది గ్రస్తులు చేసిన వంటలు ఎలా తింటాం, తాగుతాం అనే భయం లేకుండా వంటల వద్ద మాత్రం వేరే వ్యక్తులను ఏర్పాటు చేయడం జరిగింది.

పైగా వంట రూంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గ్లాస్‌ వాల్‌ను ఏర్పాటు చేశారు.వంట రూంలో ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలు క్లీయర్‌గా కనిపించడం వల్ల కస్టమర్లకు ఎలాంటి టెన్షన్‌ లేకుండా నిర్వహకులు చేశారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మొత్తానికి ఈ ఎయిడ్స్‌ బాధిత రోగులు నడుపుతున్న కేఫ్ పాజిటివ్ కు మంచి డిమాండ్‌ ఉంది.అకౌంట్స్‌, హెల్పర్స్‌, సర్వీస్‌ వంటి పనులు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు చేస్తారు, మిగిలిన వంట పని మాత్రం సాదారణ వ్యక్తి నిర్వహిస్తాడు.ప్రస్తుతం ఈ హోటల్‌ రోజులో 15 వేల వరకు బిజినెస్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు