Mahesh Babu Srileela: మహేష్ శ్రీలీల మధ్య ఏజ్ గ్యాప్ అంతా.. ఈ జోడీ సూట్ అవుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

అటు మహేష్ బాబు ఇటు త్రివిక్రమ్ సినిమాల విషయంలో ఫుల్ ఫామ్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో ఫస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే కాగా సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ఎంపికయ్యారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.అయితే మహేష్ శ్రీలీల జోడీ గురించి ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ జోడీ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉండటంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

శ్రీలీల వయస్సు కేవలం 21 సంవత్సరాలు కావడంతో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండదు.

Advertisement
Age Gap Between Mahesh Babu And Srileela Details, Mahesh Babu, Srileela, Mahesh

మహేష్ శ్రీలీల జోడీ గురించి నెగిటివ్ కామెంట్లు వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ వచ్చే నెలలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.

Age Gap Between Mahesh Babu And Srileela Details, Mahesh Babu, Srileela, Mahesh

మహేష్ ఈ ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేసి రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీ కావాలని అనుకుంటున్నా పరిస్థితులు అనుకూలించడం లేదు.రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.మహేష్ అభిమానులు మాత్రం మహెష్ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి మహేష్ సంతోషంగా జీవనం సాగించాలని కోరుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 47 సంవత్సరాల వయస్సులో కూడా అదిరే లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.మహేష్ రాజమౌళి కాంబో మూవీ హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉండనుందని వినిపిస్తుండగా షూటింగ్ మొదలయ్యే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తానని జక్కన్న చెబుతున్నారు.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు