అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఆదిత్య L-1.. సూర్యునిపై ఏఏ దేశాలు ప్రయోగాలు చేశాయంటే..?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3( Chandrayaan-3 ) విజయవంతం కావడంతో.

తాజాగా భారత తొలి సూర్యయాన్ ఆదిత్య L-1 ఉపగ్రహం కొద్దిసేపటి ముందే నింగిలోకి దూసుకెళ్లింది.

సూర్యుడిపై పరిశోధనలకు ఉపగ్రహాలను పంపడం కాదు.చంద్రుడిపై మనిషి కాలు పెట్టక ముందే సూర్య అధ్యయనాలు మొదలయ్యాయి.

అయితే భగభగమండే సూర్యుడిపై దిగడం, సూర్యునికి అతి దగ్గర సమీపం నుండి అధ్యాయం చేయడం సాధ్యం కాదు కాబట్టి లక్షల కిలోమీటర్ల దూరం నుంచే సూర్యునిపై పరిశోధనలు చేస్తున్నారు.

Aditya L 1 Which Flew Into Space Which Countries Have Experimented On The Sun

సూర్యునిపై అమెరికా, రష్యా, జపాన్, యూరప్ లాంటి తదితర దేశాలు సోలార్ మిషన్లను విజయవంతంగా ప్రయోగించి సూర్యుని గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకున్నాయి.సూర్యుడి మీద హీలియం, అయస్కాంత శక్తి వాటి ఫలితంగా వాతావరణంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ రహస్యాలు చేదించడమే సోలార్ మిషన్ల ప్రధమ లక్ష్యం.1960 నుంచి 1969 మధ్యలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏకంగా ఆరు ఉపగ్రహాలను పంపించగా 5 విజయం సాధించాయి.జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి కూడా అమెరికా పలు సూర్యయాన్ మిషన్లను చేపట్టింది.

Advertisement
Aditya L 1 Which Flew Into Space Which Countries Have Experimented On The Sun-�

జపాన్ సొంతంగా ప్రయోగాలు నిర్వహించింది.

Aditya L 1 Which Flew Into Space Which Countries Have Experimented On The Sun

1995డిసెంబర్ లో నాసా( NASA ), ఈఎస్ఏ కలిసి సోహో మిషన్ చేపట్టాయి.ఈ మిషన్ సూర్యుని అంతర్గత, బాహ్య వాతావరణంలో మరియు సౌర వాయువులను అధ్యయనం చేసింది.సోలార్ సైకిల్, కరోనల్ హోల్స్, సూర్య జ్వాలలు, విస్పోటాల గురించి సరికొత్త విషయాలను కనిపెట్టింది.2006లో నాసా సంస్థ స్టీరియో ప్రాజెక్టు కింద A,B అనే రెండు సూపర్ క్రాఫ్ట్ లను పంపింది.భూకక్ష్యకు చెరోవైపున ప్రవేశపెట్టిన ఈ ఉపగ్రహాలను స్టిరియోస్కోపిక్ అధ్యాయనం చేశారు.సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లను పరిశీలించారు.2014 అక్టోబర్ లో A తో నాసాకు సంబంధాలు తెగిపోగా, B ఇప్పటికి సజావుగానే పనిచేస్తోంది.

2006లో జపాన్ పినోడ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేసింది.సూర్యుని మ్యాగ్నెటిక్ డైనమా, సూర్య పవనాలకు-అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉన్న సంబంధాల గురించి కొంత సమాచారం పంపింది.2010లో నాసా ఎస్డీవో ఉపగ్రహాన్ని ప్రయోగించింది.సోలార్ యాక్టివిటీ, అయస్కాంత శక్తిని అధ్యయనం చేసింది.2018లో నాసా పార్కర్ సోలార్ ప్రోబ్( Parker Solar Probe ) ను ప్రయోగించింది.ఈ ప్రయోగ లక్ష్యం సూర్యుడికి అతి చేరువ కక్ష్యలోకి వెళ్లడం.సూర్యునికి 6.2 మిలియన్ కిలోమీటర్ల దగ్గరకు 2025లో చేరుకొనుంది. ఈ మిషన్ ఒక గంటకు 6.9 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.2020లో నాసా, ఈఎస్ఏ సోలార్ ఆర్బిటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.సూర్యుడి ధృవ ప్రాంతాలు, భూమికి సూర్యుని మధ్య ఉన్న బంధం పై అధ్యయనం చేసింది.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు