భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సెల్ఫీలు

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం విజయవంతంగా పని చేస్తోంది.

ఇందులో భాగంగా భూ ఎగువ కక్ష్యలో ఉన్న ఆదిత్య ఎల్1 సెల్ఫీలు తీసి పంపింది.

ఈ క్రమంలోనే భూమి, చంద్రుడు ఫోటోలను తీసింది.ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

కాగా సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్1 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే రెండుసార్లు భూకక్ష్య పెంపు విన్యాసాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.

ఈ నెల 10వ తేదీన మూడోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని చేపడుతున్నట్లు వెల్లడించింది.కాగా మొత్తం ఐదు దశాల్లో కక్ష్యను పెంచి.16 రోజుల తర్వాత సూర్యుడి దిశగా ఉపగ్రహాన్ని పంపుతారు.మొత్తం 125 రోజులు ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది.

Advertisement

అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పరిశీలించి నిమిషానికి ఒక ఫోటోను తీసి పంపుతుంది.ఐదేళ్ల కాలపరిమితితో సూర్యుడి గురించి పరిశోధనలకు ఈ ఉపగ్రహాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు