50 వేల రూపాయలు పెట్టి ఆ క్రీమ్ కొన్నాను.. టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో టబు ఒకరు.తెలుగులో నాగార్జున టబు కలిసి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

తాజాగా టబు ఒక ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.హీరోయిన్ టబు తన గ్లామర్ సీక్రెట్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అందంగా ఉండటం కోసం తాను 50,000 రూపాయల ఫేస్ క్రీమ్ ను కొనుగోలు చేశానని ఆమె తెలిపారు.అయితే ఆ ఫేస్ క్రీమ్ ను ఒకసారి మాత్రమే కొనుగోలు చేశానని ఆ తర్వాత ఆ క్రీమ్ ను వాడలేదని టబు చెప్పుకొచ్చారు.

మేకప్ ఆర్టిస్ట్ సలహా మేరకు తాను ఒకే ఒకసారి ఆ క్రీమ్ ను కొనుగోలు చేయడం జరిగిందని ఆ తర్వాత తాను ఎప్పుడూ ఫేస్ క్రీమ్ ను కొనుగోలు చేయలేదని, ఫేస్ వాష్ చేయించుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.భూల్ భూలయ్యా2 సినిమాతో టబు భారీ సక్సెస్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం టబు హిందీ దృశ్యం2 సినిమాలో నటిస్తున్నారు.అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో టబు ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా టబు గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు.టబుకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నాయని సమాచారం అందుతోంది.

అల వైకుంఠపురములో సినిమాలో నటించిన పాత్ర వల్ల టబుకు మంచి పేరు వచ్చిందనే విషయం తెలిసిందే.టబు 50 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.టబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో టబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు