పెట్రోల్ ధరలపై రమ్య ట్విట్టర్ లో చేసిన ఈ ట్రోల్ చూస్తే నవ్వాపుకోలేరు.! జడేజా రెండో స్థానం అంట.!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ భగ్గుమంటూ శుక్రవారం ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించాయి.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.

87.39కి చేరింది.రూ.90 దాటడానికి మరెన్నో రోజులు పట్టదంటూ నిపుణులు చెబుతున్నారు.పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర రూ.80 దాటేసింది.మధ్యప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ రూ.85.80కి చేరింది.ఢిల్లీలో రూ.79.99కి పెట్రోల్ ధరలు చేరుకోగా, డీజిల్ 72.07 అయింది.ఇదే తరహాలో డీజిల్ ధరలు సైతం చుక్కలనంటుతున్నాయి.ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.72.07కు చేరింది.ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు ఇవాళ భారత్ బంద్ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రమ్య తనదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు.‘‘86 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అత్యధిక స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.అయితే రూ.87కు దూసుకెళ్లిన పెట్రోల్ అంతకంటే టాప్‌లో కొనసాగుతోంది.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

అంతేకాదు.దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ మాదిరిగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయంటూ ఆమె పోస్టు చేసిన మరో ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.యూపీఏ హయాంలో అమిర్‌ఖాన్ సిక్స్ ప్యాక్‌లో కనిపించినట్టు పెట్రోల్ ధరలు ఉన్నాయనీ.

ఎన్డీయే హయాంలో దంగల్ సినిమాలో అమీర్‌ఖాన్‌లా ధరలు పెరిగాయని ఆమె పోల్చి చెప్పడంతో నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

Advertisement
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన
Advertisement

తాజా వార్తలు