తినే కంచంలో ఉమ్మేసిన సుధీర్ బాబు: నటుడు అజయ్

తాజాగా విడుదలై.మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.

ప్రస్తుతం ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది.అంతేకాదు.

ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్టింగ్ అదుర్స్అనే టాక్ వినిపిస్తుంది.గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో పరిణతి కలిగిన నటన కనిపిస్తుందంటున్నారు సినిమా క్రిటిక్స్.

ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా ఆకట్టుకున్నాడంటున్నారు జనాలు.పలాస సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడే ఈ సినిమానూ తెరకెక్కించాడు.

Advertisement

కులాల కొట్లాటను అద్భుతంగా తెరకెక్కించాడు అనే టాక్ నటుస్తోంది.సినిమా ఔట్ పుట్ నిజానికి చాలా లెన్తీగా వచ్చిందట.

ఈ నేపథ్యంలో చాలా సీన్లు ట్రిమ్ చేశారట.అందులో భాగంగానే సినిమాలోని పలు సీన్లు తొలగించారట.

ఈ సీన్లు చాలా ఎమోషనల్ గా, అత్యంత కోపం కలిగించేలా ఉన్నాయట.అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే సూపర్ డూపర్ హిట్ కావడంతో పలు డెలిటెడ్ సీన్లను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారట.

ఈ వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.వీటి ద్వారా సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వారెవ్వా అనిపిస్తుంది.ఈ సీన్ జైల్ కిచన్ లోనిది.ఈ చిత్రంలో విలన్ రోల్ పోషించిన విలన్ అజయ్.

Advertisement

హీరో సుధీర్ బాబు దగ్గరికి వస్తాడు.కోర్టు నుంచి వచ్చేటప్పుడు మా వాళ్లు ఇచ్చిన డ్రగ్స్ ప్యాకెట్స్ ఎందుకు తీసుకురాలేదని తీవ్ర స్వరంతో అరుస్తాడు.

అంతేకాదు.సుధీర తినే ప్లేట్ లో ఉమ్మివేస్తాడు.

సుధీర్ కోపంతో ఊగిపోతాడు.కానీ సంయమంగానే కనిపిస్తాడు.

అంతలోనే జైల్ అధికారి వచ్చి గొడవను క్లియర్ చేస్తాడు.అజయ్ తో పాటు, సుధీర్ కూడా సీరయస్ లుక్ లో అదుర్స్ అనిపిస్తారు.

ఇలాంటి సీన్లు సినిమా నుంచి చాలా తొలగించినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు