జనవరి 25 నుండి 31 వరకు ఆసరా పింఛన్ల పంపిణీ...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనవరి 25 గురువారం నుండి ప్రారంభమై 31 వరకు అసరా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖా అధికారులు ప్రకటించారు.25 నుండి ఈ నెల 31వ తారీకు వరకు విడతల వారీగా బట్వాడా చేస్తున్నామని తెలిపారు.

వృద్ధాప్య,వితంతు,వికలాంగ,చేనేత,కల్లుగీత,ఒంటరి మహిళ అన్ని రకాల పెన్షన్లు మీ సంబంధిత పోస్టల్ అధికారుల వద్దే మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా తీసుకోవాలని సూచించారు.

దళారులను నమ్మి మోసపోవద్దని,మీ పెన్షన్ పొందుటకు ఎవరికి డబ్బు ఇవ్వనవసరం లేదని,ఈ అవకాశాన్ని జిల్లాలోని ఆసరా పెన్షన్ దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News