టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్‌ప్రెస్ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి హాకీ ఆట చిత్రంగా చిత్ర యూనిట్ గతకొద్ది రోజులుగా ప్రమోషన్ చేస్తూ వస్తోంది.
కాగా ఈ సినిమాలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో ఈ షార్ట్ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికి వస్తే.సంజు అలియాస్ సందీప్ నాయుడు(సందీప్ కిషన్) తన మావయ్య(పోసాని కృష్ణమురళి) ఇంటికి వెళ్లేందుకు పాండిచెర్రికి వెళ్తాడు.అక్కడ లవ్ అలియాస్ లావణ్య రావ్(లావణ్య త్రిపాఠి)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు.హాకీ ప్లేయర్‌గా ఉన్న లవ్ కోసం ఓ హాకీ మ్యాచ్ ఆడతాడు సంజు.
అయితే ఈ క్రమంలోనే సంజు గురించి ఓ ఆసక్తికరమైన విషయం అందరికీ తెలుస్తుంది.ఇంతకీ ఈ సంజు ఎవరు.? లవ్ కోసం సంజు ఏం చేస్తాడు.? అనేది ఈ సినిమా కథ.ఇక ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ల విషయానికి వస్తే దర్శకుడు డెన్నిస్ జీవన్ ఈ సినిమా కథను ఓ తమిళ చిత్రం నుండి తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఉన్న కథను ఉన్నట్లుగా కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కొన్ని సీన్స్ మార్పులు చేసి చక్కగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు.
అటు సినిమాటోగ్రఫీ, సంగీతం ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి.అయితే ఈ సినిమాలో కొన్ని ల్యాగ్ సీన్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని పూర్తిగా మాయం చేస్తాయి.
ఓవరాల్‌గా రీమేక్‌కు తక్కువ, ఒరిజినల్ సినిమాకు ఎక్కువగా వచ్చిన ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కినా, ఈ సినిమాలో కథ మాత్రం స్పోర్ట్స్ కాకుండా వేరే అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఇక ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు తమవంతు పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
ఏదేమైనా ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రంతో సందీప్ అదిరిపోయే హిట్ అందుకుంటాడని చూసినవారు అలాంటి సక్సెస్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.
రేటింగ్: 2.25/5.0