AP BJP : ఏపీ బీజేపీలో సీనియర్ల అలక..!!

ఏపీ బీజేపీ( AP BJP )లో సీనియర్ నాయకుల అలకలు కొనసాగుతున్నాయి.ఇవాళ జరిగిన పార్టీ పదాధికారుల సమావేశానికి సీనియర్లంతా డుమ్మా కొట్టారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeswari ) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు జీవీఎల్ నరసింహరావు, సోము వీర్రాజు, సత్యకుమార్ మరియు విష్ణువర్ధన్ రెడ్డి గైర్హాజరు అయ్యారు.

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో సీట్లను ఆశించిన నలుగురు నేతలు భంగపడిన సంగతి తెలిసిందే.పొత్తులో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ వీటిలో ఐదు సీట్లను వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలకే కేటాయించారని సీనియర్లు మండిపడుతున్నారు.అయితే పార్టీ ముఖ్యనేతలు సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు