వైరల్ వీడియో: ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా( Agra in Uttar Pradesh ) నగరంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.ఓ లారీ డ్రైవర్ తన నిర్లక్ష్యంతో ఇద్దరి బైక్‌ రైడర్స్ ను గమనించకుండా లారీ కింద ఇరికించి, వారిని ఏకంగా 1.

5 కిలోమీటర్ల దూరం ఏడుచుక వెళ్ళాడు.ఈ సంఘటన చూసిన వారంతా భయబ్రాంతులకు లోనయ్యారు.

ఆగ్రా నగరంలోని రాంబాగ్ జంక్షన్‌ ( Rambaug Junction )వద్ద ఈ ప్రమాదం జరిగింది.ప్రకాశ్ నగర్‌కు చెందిన జాకీర్ ( Zakir )అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి విద్యుత్‌ కేంద్రం నుంచి రాంబాగ్‌లోని తన ఇంటికి బైక్‌పై బయలుదేరాడు.

రాంబాగ్ జంక్షన్ వద్ద ఆయన బైక్‌తో యూ-టర్న్ తీసుకుంటుండగా, వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది.ఈ సంఘటనతో బైక్ లారీ ముందు భాగానికి ఇరుక్కుపోయింది.

A Viral Video Shows A Truck Driver Dragging Two People On The Road, Agra Accide
Advertisement
A Viral Video Shows A Truck Driver Dragging Two People On The Road, Agra Accide

లారీ డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా బైక్‌ను, అందులో ఉన్న వ్యక్తులను మొత్తం లారీ కిందనే 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఈడుచక వెళ్ళాడు.ఈ భయానకర ఘటనను చూసిన పాదచారులు, రోడ్డుపై వెళ్తున్న వారు వెంటనే లారీని ఆపేందుకు ప్రయత్నించారు.

కానీ లారీ డ్రైవర్ లారీని ఆపలేదు.ఇలా లాక్కెళ్తున్న సమయంలో బైక్ నుంచి కాస్త దూరం వెళ్లే కొద్దీ మంటలు రేగుతుండగా, రెండు సిగ్నల్‌లు దాటిన తర్వాత లారీ చివరకు ఆగింది.

A Viral Video Shows A Truck Driver Dragging Two People On The Road, Agra Accide

స్థానికులు వెంటనే లారీని చుట్టుముట్టి బాధితులను రక్షించారు.డ్రైవర్‌ను పట్టుకొని అతడికి తగిన బుద్ది చెప్పి పోలీసులకు అప్పగించారు.బాధితులిద్దరిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.

ఈ సంఘటన ఆగ్రాలో కలకలం రేపింది.డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాక, ఇతరులను రెచ్చగొట్టే ప్రమాదం ఉంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి డ్రైవింగ్ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రయాణ సమయంలో వేగాన్ని నియంత్రించుకోవాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.ఇటువంటి సంఘటనలు మరలా జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

ఇక ఈ వీడియో చూసిన బాధితులు త్వరగా కోలుకోవాలని అందరూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు