ఆ పార్కులో వింత రూల్.. విస్తుపోతున్న ప్రజలు

పార్కులు అంటేనే పచ్చదనం, అక్కడకు వచ్చే ప్రజలు చేసే వాకింగ్ వంటివి గుర్తొస్తుంటాయి.ఇంకొంచెం పెద్ద పార్క్ అయితే అందులో ప్రేమ జంటల హడావుడి కనిపిస్తోంది.

అవి ఫ్యామిలీలతో వెళ్లే వారికి ఇబ్బందులు ఉంటాయి.కాసేపు అక్కడ సేదదీరుదామనుకునే వారికి ప్రేమ జంటల చేష్టలు చిరాకు కలిగిస్తాయి.

కనిపించిన పొద దగ్గర, చెట్టు కిందో కొంచెం అభ్యంతరకర రీతిలో కనిపిస్తుంటారు.ఇవి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి పార్కుల వద్ద కొన్ని హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు.పార్కుల్లో అభ్యంతరకర పనులు చేస్తే ఫైన్ విధిస్తామని అందులో పేర్కొంటారు.

Advertisement

అయితే బెంగళూరులోని ఓ పార్కులో వింత రూల్ పెట్టారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

బెంగళూరులోని ఓ పార్కులో ఇటీవల ఓ బోర్డు పెట్టారు.పార్కు గేటుకు ముందు ఆ బోర్డులో రాసి ఉన్నది చదివి పార్కుకు వచ్చిన సందర్శకులు అవాక్కవుతున్నారు.

ఇదేమీ రూల్స్ అంటూ విస్తుపోతున్నారు.అందులో ఏం రాసి ఉందంటే ఈ పార్కులో జాగింగ్ చేయకూడదు.

రన్నింగ కూడా చేయకూడదు.రౌండ్ ది క్లాక్ తరహాలో అస్సలు నడవకూడదు అని ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

ఎక్కువ మంది ప్రస్తుతం నగరాలలో రన్నింగ్, జాగింగ్ చేసేందుకు పార్కులకే వస్తుంటారు.చల్లని గాలి, పచ్చని చెట్ల మధ్య కాసేపు గడపాలనుకుంటుంటారు.

Advertisement

ఇలాంటి తరుణంలో బెంగళూరు పార్కులో పెట్టిన బోర్డుతో అక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు.జాగింగ్, వాకింగ్, రన్నింగ్‌ కోసం కాకపోతే మరి ఇంకెందుకు పార్కుకు రావాలి అంటూ మండిపడుతున్నారు.

ఓ వైపు విమర్శలు వస్తున్నా, దీనిపై బెంగళూరు కార్పొరేషన్ మాత్రం ఆ బోర్డు ఎందుకు పెట్టారో వివరణ ఇవ్వలేదు.

తాజా వార్తలు