టి20 ఫార్మేట్ లో అరుదైన మ్యాచ్.. 15 పరుగులకే ఆలౌట్ అయిపోయిన టీం..!!

క్రికెట్ లో ఒకప్పుడు వన్డే మ్యాచ్ లకు మంచి క్రేజ్ ఉండేది.కానీ టి20 ఫార్మేట్ వచ్చాక పరిస్థితులు మొత్తం మారిపోయాయి.

దీంతో వన్డే మరియు టెస్ట్ మ్యాచ్ ల కంటే ఎక్కువగా క్రికెట్ ప్రేమికులు T20 ఫార్మేట్ మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తున్నారు.దీంతో చాలా దేశాలు అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు సొంతంగా ఐపీఎల్ లు నిర్వహిస్తున్నాయి.

Sydney Thunder Bowled Out For 15 Runs In Big Bash League Match Against Adelaide

ఈతరహాలోనే ఆస్ట్రేలియాలో డిసెంబర్ 13వ తారీకు నుండి బిగ్ బ్యాష్ T20 లీగ్‌ స్టార్ట్ అయ్యింది.అయితే ఈ టోర్నీలో శుక్రవారం ఆడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్ని థండర్ మధ్య జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డు క్రియేట్ అయింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆడిలైడ్ స్టైకెర్స్.20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.అనంతరం సెకండ్ బ్యాటింగ్ కి దిగిన సిడ్నీ థండర్ టీం మొదటి పవర్ ప్లేలోనే 5.5 ఓవర్ లలో 15 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. అడిలైడ్ స్ట్రైకర్స్ టీంలో హెన్రీ టోరంటన్ 2.5 ఓవర్ లు వేసి ఐదు వికెట్లు తీసి సిడ్నీ థండర్ టీం ఓటమికి కారణమయ్యాడు.దీంతో హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం జరిగింది.

కాగా ఇప్పటివరకు టి20 చరిత్రలో ఇంత తక్కువ స్కోరుకి మొదట పవర్ ప్లే లోనే అల్ ఔట్ ఆయన సందర్భం లేదు.దీంతో ఈ మ్యాచ్ లేటెస్ట్ గా టి20 విభాగంలో రికార్డుగా నిలిచింది.

Advertisement
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

తాజా వార్తలు